Allu Arjun : కూతురి కోసం బ‌న్నీ ఇంత‌లా ఆలోచిస్తున్నాడా.. అవాక్క‌వుతున్నభిమానులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Allu Arjun : కూతురి కోసం బ‌న్నీ ఇంత‌లా ఆలోచిస్తున్నాడా.. అవాక్క‌వుతున్నభిమానులు

Allu Arjun : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో అల్లు అర్జున్ ఒక‌రు. ఆయ‌న సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో క‌లిసి తెగ సంద‌డి చేస్తున్నారు. ముఖ్యంగా కూతురితో బ‌న్నీ చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. ఆమె అల్లరి అల్లు అర్జున్ తెగ ఎంజాయ్ చేస్తారు. అర్హతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి షేర్ చేయడం సరదాగా ఫీల్ అవుతారు. తండ్రికి తగ్గట్లే అర్హకి ఎనర్జీ చాలా ఎక్కువ.ఇటీవ‌ల తండ్రి కొడుకులు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :24 September 2022,10:30 am

Allu Arjun : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో అల్లు అర్జున్ ఒక‌రు. ఆయ‌న సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో క‌లిసి తెగ సంద‌డి చేస్తున్నారు. ముఖ్యంగా కూతురితో బ‌న్నీ చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. ఆమె అల్లరి అల్లు అర్జున్ తెగ ఎంజాయ్ చేస్తారు. అర్హతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి షేర్ చేయడం సరదాగా ఫీల్ అవుతారు. తండ్రికి తగ్గట్లే అర్హకి ఎనర్జీ చాలా ఎక్కువ.ఇటీవ‌ల తండ్రి కొడుకులు చేసిన ర‌చ్చ‌కు సంబంధించిన వీడియోలో అర్హ వాళ్ళ నాన్నకు కొన్ని పరీక్షలు పెట్టింది. మొదటగా… గంగిగోవు పాలు గరిటడైనను చాలు? అని అడిగింది. అది పొడుపు కథ అని భావించిన అల్లు అర్జున్.. జున్ను అని ఆన్సర్ చెప్పాడు.

Allu Arjun : మంచి నిర్ణ‌యం..

నీకెలా తెలుసు అని అర్హ అడిగింది. నాకు తెలుసురా బే అని బన్నీ అన్నారు. నెక్స్ట్ ఓ క్రిటికల్ పరీక్ష పెట్టింది. ‘ఐదు నల్ల లారీలు ఐదు తెల్ల లారీలు’ అనే వాఖ్యాన్ని తప్పు పోకుండా గబగబా చెప్పాలంది. ఈ పరీక్షలో అల్లు అర్జున్ ఫెయిల్ అయ్యారు. ఆయన ఆ పదాలను త్వర త్వరగా పలకలేకపోయారు. మొత్తానికి కూతురితో మాత్రం స‌ర‌దాగా గ‌డిపాడు. అయితే బ‌న్నీ కూతురు శాకుంత‌లం అనే చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌గా, ఆమె ప‌ర్ ఫ‌ర్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

Allu Arjun Important Decision About His Daughter

Allu Arjun Important Decision About His Daughter

అయితే శాకుంత‌లం చిత్రం త‌ర్వాత బ‌న్నీ కూతురు ఏదైన సినిమాల‌లో న‌టిస్తుందా అనే ఆస‌క్తి అంద‌రిలో ఉండ‌గా, బన్నీ మాత్రం త‌న పిల్లల‌ను ఇప్ప‌ట్లో సినిమాల‌లో న‌టింప‌జేయ‌కూడ‌దు అని అనుకుంటున్నాడ‌ట‌. వాళ్ల చదువులు అయిపోయిన తర్వాత సినీ ఇండస్ట్రీలోకి వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడట. ఇక ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప గా థియేటర్స్ లో పూనకాలు తెప్పించిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క పాన్ ఇండియా సినిమాతో ఇప్పుడు ఆలు అర్జున్ పేరు దేశాలు దాటి వినిపిస్తుంది. ఎక్కడ చూసిన పుష్ప పాటలే.. పుష్ప డైలాగులే.. అంతలా జనాల్లోకి దూసుకెళ్లింది ఈ సినిమా. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది