Allu Arjun : బన్నీ ని స్టార్ హీరోస్ దూరం పెడుతున్నారా..? పెట్టేశారా..? దీనికి ఉదాహరణ ఇదేనా..?
ప్రధానాంశాలు:
Allu Arjun బన్నీ ని స్టార్ హీరోస్ దూరం పెడుతున్నారా..? పెట్టేశారా..? దీనికి ఉదాహరణ ఇదేనా..?
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను టాలీవుడ్ దూరం పెడుతుందా..? అందుకే ఆయన పుట్టిన రోజునాడు ఎవ్వరు విషెష్ చేయలేదా..? ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బన్నీ.. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రం కూడా లైన్‌లో ఉంది. తాజాగా బన్నీ తన పుట్టినరోజు ఏప్రిల్ 8న ఘనంగా జరుపుకున్నాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే .. టాలీవుడ్ స్టార్ హీరోలెవరూ బన్నీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయలేదు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్పందించి విషెస్ తెలియజేశాడు.

Allu Arjun : బన్నీ ని స్టార్ హీరోస్ దూరం పెడుతున్నారా..? పెట్టేశారా..? దీనికి ఉదాహరణ ఇదేనా..?
Allu Arjun : పాన్ ఇండియా స్టార్ బర్త్డే ను పట్టించుకోని చిత్రసీమ …?
తాజాగా ఈ వ్యవహారం వెనుక సంధ్య థియేటర్ ఘటన ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ‘పుష్ప: ది రూల్’ టీజర్ రిలీజ్ సందర్భంగా హైదరాబాదులోని సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత బన్నీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విడుదలైన వెంటనే పలువురు హీరోలు బన్నీని పరామర్శించడానికి రావడం, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో సినిమా ఇండస్ట్రీలో చాలామంది వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తోంది.
ఇందుకు తోడు బన్నీ పుట్టినరోజునా కూడా మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రానా వంటి సన్నిహిత నటులు కూడా శుభాకాంక్షలు తెలియజేయకపోవడం గమనార్హం. ఈ పరిణామాలతో అల్లు అర్జున్ టాలీవుడ్‌లో ఒంటరి అయ్యాడనే చర్చకు దారితీసింది. పుష్ప 2 సినిమాతో బన్నీ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నప్పటికీ, తెలుగు సినీ వర్గాల్లో ఈ మౌనం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఈ దూరం తగ్గుతుందా? లేదా బన్నీ వేరే దారి పడతాడా? అనేది ఆసక్తికర అంశంగా మారింది.