Allu Arjun : ఫ్యాన్స్ హ్యపీ.. పవన్ కళ్యాణ్ ఇంటికి సతీసమేతంగా వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ప్రధానాంశాలు:
Allu Arjun : ఫ్యాన్స్ హ్యపీ.. పవన్ కళ్యాణ్ ఇంటికి సతీసమేతంగా వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
Allu Arjun : గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌ల మధ్య మంచి రిలేషన్ లేదనే వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. మెగా ఫ్యామిలీ అంతా బన్నీని పక్కన పెట్టిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ పుకార్లకి చెక్ పెడుతూ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సతీసమేతంగా వెళ్లినట్టు తెలుస్తుంది.

Allu Arjun : ఫ్యాన్స్ హ్యపీ.. పవన్ కళ్యాణ్ ఇంటికి సతీసమేతంగా వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
Allu Arjun కలిసిన బన్నీ, పవన్
పవన్ చిన్న కిమారుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో పవన్ కుటుంబాన్ని పరామర్శించి, చిన్నారి ఆరోగ్యంపై బన్నీ, స్నేహలు ఆరా తీసినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కలిసినటువంటి దృశ్యాలు ఏమి బయటకు రాలేదు. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్ళకు స్వల్ప గాయాలు అయ్యాయి. అంతేకాకుండా.. ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మొత్తంలో పొగ పీల్చడం వల్ల అతడు కొంత ఇబ్బందికి గురయ్యాడు.
ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకుని విశాఖపట్నం నుండి సింగపూర్‌కు హుటాహుటిన చేరుకున్నారు. దగ్గరుండి కుమారుడికి మంచి వైద్యం అందించారు. ఇక మార్క్ శంకర్ కోలుకోవడంతో ఇటీవలే పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీతో హైదరాబాద్‌కి తిరిగి వచ్చేశారు. ఇక హైదరాబాద్‌కి వచ్చిన అన్నా లెజినోవా తిరుమల వెళ్లి మొక్కులు కూడా చెల్లించుఏకుంది.