Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా అవతరించిన విషయం తెలిసిందే. కానీ తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఏకంగా 20 ఏళ్లు కష్టపడాల్సి వచ్చిందట.. బన్నీ సినిమాల్లో చాలా మంది చూసేది అతని డ్యాన్స్. దానితోనే స్టైలీష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో స్టోరీ డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్స్ అయినా పోషించేందుకు సై అంటున్నాడట బన్నీ.. ఇదిలాఉంటే బన్నీ తన కెరీర్‌లో చాలా హిట్స్ సినిమాలను వదులుకున్నాడు. దర్శకుడు ఇంత బాగా తీస్తారని తెలియకే సినిమాలు వదులుకున్నాడా? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
అల్లు అర్జున్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్న టైంలో అల్లు అరవింద్‌కు తేజ జయం సినిమా కథ చెప్పాడట.. అందుకు అరవింద్ కూడా ఓకే అన్నారట.. కానీ అనుకోకుండా ఈ కథ నితిన్‌కు చేరడంతో మనోడు తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు.ఇక బోయపాటి శ్రీను భద్ర కథను ముందుగా అల్లు అర్జున్‌కు చెప్పారట. కానీ అప్పుడే ఆర్య లాంటి ప్రెష్ స్టోరీ చేస్తూ వెంటనే యాక్షన్ సినిమా చేస్తే జనాలు రీసివ్ చేసుకుంటారో లేదో అని బన్నీ వద్దనడంతో అది కాస్త రవితేజకు వెళ్లిపోయింది. ఇక సుకుమార్ 100 % లవ్ స్టోరీని ముందుగా బన్నీకి చెప్పాడట.ఈ సాఫ్ట్ లవ్ స్టోరీస్ తనకు కనెక్ట్ కావని చెప్పడంతో చివరకు అరవింద్ నిర్మాతగా నాగ చైతన్యతో చేసి హిట్ కొట్టాడు సుకుమార్.
టాలీవుడ్ సూపర్ హిట్ గీత గోవిందం మూవీ విజయ్‌కు లైఫ్ ఇచ్చింది. ఈ స్టోరీని పరుశురాం ముందుగా బన్నీకి చెప్పాడట..అతను నో చెప్పడంతో ఈ హిట్ కాస్త విజయ్ చేతికి వెళ్లిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా కథను ముందుగా సందీప్ రెడ్డి వంగా అల్లు అర్జున్‌గా చెప్పగా..ఎందుకో ఇది చేయడానికి బన్నీకి దైర్యం చాలలేదట..ఆ తర్వాత ఇది విజయ్ దగ్గరకు చేరడంతో మనోడు బ్లాక్ బాస్టర్ కొట్టి టాలీవుడ్‌కు రౌడీ బాయ్‌గా ఎదిగాడు.అదేవిధంగా బన్నీ వద్దనుకున్న సినిమాల్లో కృష్ణాష్టమి, పండగ చేస్కో,గ్యాంగ్ లీడర్,డిస్కో రాజా, జాను, బొమ్మరిల్లు, సుప్రీమ్ వంటి సినిమాలు కూడా ఉండటం గమనార్హం.
Allu Arjun : గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పుష్ప2లో…
Mohan Babu : తన ఫ్యామిలీతో జరుగుతున్న గొడవల్లో భాగంగా రిపోర్టర్ చెవికి గాయాన్ని చేశారు హీరో మంచు మోహన్…
Jr NTR : ఎన్ టీ ఆర్ ఫ్యాన్ కౌశిక్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ టైం లో…
Health Benefits : 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీలో ఆ స్టామినా మెయింటెనెన్స్ చేయడానికి కొన్ని ఆహారాలు…
Sai Pallavi Nithiin : ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు వేణు. ఆ సినిమాకు అవార్డులతో…
Good News : కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలు తీసుకొస్తూ ప్రజలని సంతోష పరుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
Nara Bhuvaneshwari : మరి కొద్ది రోజులలో 2024కి గుడ్ బై చెప్పబోతున్నాం.ఈ క్రమంలో ఈ ఏడాది జరిగిన సంగతుల…
Game Changer Movie : గ్లోబల్ స్టార్ రాం చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా గేమ్…
This website uses cookies.