Bigg Boss 6 Telugu : తెలుగు బుల్లితెర చరిత్రలో సంచలనాలు క్రియేట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం చాలా ఏళ్లుగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది ప్రతి ఏడాది రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఇలా ఇప్పటికే చాలా సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్.. త్వరలోనే మరో సీజన్‌తో ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ నేపథ్యంలో రాబోయే సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఇప్పటికే ఈ షో ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దానిని కూడా సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. దీనిని కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు.
ఆరో సీజన్ కోసం ఏకంగా 21 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేశారనే టాక్ నడుస్తోంది. ఇందులో ఒకరిద్దరు జబర్దస్త్ కమెడియన్లు, దీపికా పిల్లిలతో పాటు సీనియర్ యాంకర్ ఉదయభాను కూడా ఉన్నారని, ఆమెకు అత్యధిక రెమ్మ్యూనరేషన్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తున్నారని విన్నాం. అయితే చివరి మూమెంట్ లో ఆమె ఈ షోకు రానని చెప్పినట్లు తెలుస్తోంది.వారు మరెవరో కాదు ఉదయభాను, దీపికా పిల్లి అంటున్నారు.కొన్ని వ్యక్తిగత కారణాలతో ఉదయ భాను, డేట్స్ అడ్జస్ట్ చేయలేక దీపిక పిల్లి ఈ సీజన్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పటికిప్పుడు ఈ ఇద్దరి ప్లేస్ భర్తీ చేయడం కోసం వేట మొదలుపెట్టిందట బిగ్ బాస్ యాజమాన్యం.ఈ క్రమంలో అనుకున్న టైంకే షో స్టార్ట్ చేస్తారా, లేక కొన్నాళ్లు వాయిదా వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
ఎంతో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం నిర్వహకులు ఎప్పటి నుంచో పనులను ప్రారంభించారు. అందుకు అనుగుణంగానే అన్నింటినీ త్వరగానే పూర్తి చేసుకున్నారు. ఇక, ఈ సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌ను సెప్టెంబర్ 4వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం చేయనున్నారు. ఇప్పుడు షో నిర్వహకులు దీనికి సంబంధించిన పనులే చేస్తున్నారు. . బిగ్ బాస్ ఆరో సీజన్‌పై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటోన్నాయి. దీనికితోడు దీని నుంచి మరిన్ని ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆరో సీజన్‌లో జరిగే నామినేషన్స్ ప్రక్రియలో పూర్తిగా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని మరింత రంజుగా మార్చేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేయబోతున్నట్లు బుల్లితెర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విషయంలో అల్లు అర్జున్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూనే…
Ap Intermediate 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న…
Zodiac Signs : రానున్న సంవత్సరంలో ముఖ్యంగా జనవరిలో గ్రహాల రవాణా అన్ని రాశుల వారి జీవితాలు పైన ప్రభావాన్ని…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ లుక్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. చిరు కూల్ లుక్ తో…
Krithi Shetty : ఉప్పెన భామ కృతి శెట్టి సినిమాల వేగం తగ్గింది. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగానే…
Allu Arjun : గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ సెంట్రాఫ్ అట్రాక్షన్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. పుష్ప2లో…
Mohan Babu : తన ఫ్యామిలీతో జరుగుతున్న గొడవల్లో భాగంగా రిపోర్టర్ చెవికి గాయాన్ని చేశారు హీరో మంచు మోహన్…
Jr NTR : ఎన్ టీ ఆర్ ఫ్యాన్ కౌశిక్ కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ టైం లో…
This website uses cookies.