Allu Arjun Movie : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా బాలీవుడ్ లో పెద్ద దుమారానికి తెర లెపింది. అల్లు అర్జున్ సినిమా వలన బాలీవుడ్ లో గొడవలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ నటించిన ‘ అలవైకుంఠపురంలో ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ను సంపాదించుకుంది. అల వైకుంఠపురంలో సినిమా యొక్క డబ్బింగ్ వర్షన్ రైట్స్ ను గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్ వారు సొంతం చేసుకున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ కు నార్త్ లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో అలవైకుంఠపురంలో డబ్బింగ్ వర్షన్ థియేటర్లో రిలీజ్ కు సిద్ధం చేశారు.
కానీ అప్పటికే బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న అలవైకుంఠపురంలో సినిమా యొక్క రీమేక్ ప్రారంభం అయింది. అల వైకుంఠపురంలో సినిమా యొక్క డబ్బింగ్ వర్షన్ థియేట్రికల్ రిలీజ్ కాకుండా చేశారు. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న రీమేక్ షెహజాదా సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది. ఇటీవలే విడుదల అయిన షెహజాదా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 10 విడుదల కాబోతుందంటూ అధికారిక ప్రకటన వచ్చింది. ఈ టైంలోనే అల వైకుంఠపురంలో డబ్బింగ్ వర్షన్ ను గోల్డ్ మైన్ వారు యూట్యూబ్ ద్వారా స్ట్రీమింగ్ కు రెడీ చేశారు.
Allu Arjun Movie Hindi dub in Bollywood
షెహజాదా సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందు అంటే ఫిబ్రవరి 2న యూట్యూబ్ ఛానల్ ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అల వైకుంఠపురంలో సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అయితే ఆ తర్వాత వచ్చిన రీమేక్ షెహజాదా సినిమాకు ఓపెనింగ్స్ విషయంలో ప్రభావం పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. దీంతో అలవైకుంఠపురం లో సినిమాలు యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కాకుండా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్ద దుమారానికే తెర లేపిందిగా అంటున్నారు సినీ విశ్లేషకులు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.