Allu Arjun : పోలీసుల అనుమతి లేకపోతే వెళ్లే వాడిని కాదు.. ఫాల్స్ ఎలిగేషన్స్ బాధిస్తున్నాయి.. అల్లు అర్జున్ !
ప్రధానాంశాలు:
Allu Arjun : పోలీసుల అనుమతి లేకపోతే వెళ్లే వాడిని కాదు.. ఫాల్స్ ఎలిగేషన్స్ బాధిస్తున్నాయి.. అల్లు అర్జున్ !
Allu Arjun : సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో జరిగిన సంఘటనలో అదంతా యాక్సిడెంటల్ గా జరిగింది. దీనిలో ఏ ఒక్కరి తప్పు లేదు. కాకపోతే తన మీద కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తున్నారని అందుకే తాను మీడియా ముందుకు వచ్చానని అన్నాడు అల్లు అర్జున్. జరిగినది ఎవరు ఊహించలేదు. అందరు వారి వారి ఎఫర్ట్స్ పెట్టారు కానీ దురదృష్టవశాత్తు అది జరిగింది. ఐతే అది జరిగిన వెటనే తాను హాస్పిటల్ కి వెళ్లాలని అనుకున్నా కానీ అప్పటికే కేసు ఉందని తెలిసి. లీగల్ ఇష్యూస్ వస్తాయని వెళ్లలేదని అన్నారు. ఐతే సినిమా రిలీజ్ రోజు కాలు చేయి విరిగితే సినిమా ఆడుతుంది అని తనపై లేని పోని అబాండాలు వేస్తున్నారని. తాను ఎవరిని ఉద్దేశించి అనట్లేదని. కేవలం తను అలాంటి వాడిని కాదని చెప్పేందుకే ప్రెస్ మీట్ పెట్టానని అన్నారు.
Allu Arjun 3 ఏళ్ల కష్టం చూడాలని థియేటర్ కి..
20 ఏళ్ల తన కెరీర్ లో ఎప్పుడు ఇది జరగలేదు. సినిమా కోసం తాను పడిన 3 ఏళ్ల కష్టం చూడాలని థియేటర్ కి వెళ్లాను. అది చూసి తను ఇంకా నేర్చుకోవాలని అనుకుంటాను. సినిమా థియేటర్ లో చూస్తున్న టైం లో బయట రద్దీ ఎక్కువ ఉందని తెలియడంతో తను వెళ్లిపోయానని. ఐతే జనాలు ఎక్కువ ఉండటం వల్ల బయటకు వచ్చి అలా అభివాదం చేశానని అది ర్యాలీలా చేయలేదు. పోలీసుల ఆధ్వర్యంలోనే ఇది జరిగిందని అన్నారు అల్లు అర్జున్.
గత 15 రోజులుగా తనని బాధ పెడుతుందని.. ఈ ఇన్సిడెంట్ వల్ల సినిమా సక్సెస్ ని కూడా సెలబ్రేట్ చేసుకోలేదని. ఇది ఎవరిని ఉద్దేశించి అనట్లేదని ఇది కేవలం తన బాధ అని అన్నారు అల్లు అర్జున్. ఐతే అల్లు అర్జున్ మీడియా ప్రశ్నలకు అన్సర్ ఇవ్వకుండా వెళ్లాడు. లీగల్ ఇష్యూస్ వల్ల తాను ఇప్పుడు ఎలాంటి సమాధానం చెప్పలేనని అన్నాడు అల్లు అర్జున్.