Revanth Reddy : అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రం.. ఇక‌పై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచ‌డం ఉండ‌దు.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రం.. ఇక‌పై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచ‌డం ఉండ‌దు.. వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :21 December 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రం.. ఇక‌పై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచ‌డం ఉండ‌దు..!

Revanth Reddy : తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సినిమా సెలబ్రిటీస్ మీద మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేడు అసెంబ్లీలో సంధ్య థియేటర్ దగ్గర మహిళ ప్రాణాలు పోయిన సంఘటన గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇక తాను సీఎం గా ఉన్నన్నాళ్లు కూడా బెనిఫిట్ షోస్, టికెట్ రేట్లను పెంచే అనుమతి ఇవ్వనని అన్నారు. అంతేకాదు అల్లు అర్జున్ ఎలాంటి పర్మిషన్ లేకుండా థియేటర్ విజిట్ చేయడమే కాకుండా సన్ రూఫ్ ఎక్కి అభివాదం చేయడం వల్లే ఆ తొక్కిసలాట జరిగింది. దాని వల్లే రేవంత్ మృతి చెందింది అని అన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాదు జైలులో ఒక పూట ఉండి వచ్చిన అతనికి కాలు విరిగిందా, చేయి విరిగిందా, కిడ్నీ పోయిందా.. ఎందుకు సెలబ్రిటీలు అంతా వెళ్లి అతన్ని మందలించారని సెలబ్రిటీల మీద తన అసంతృప్తిని వెల్లడించారు రేవంత్ రెడ్డి. అంతేకాదు సినిమా వాళ్లకు కావాల్సిన సబ్సిడీలు ఇస్తామని అయితే వారి బిజినెస్ లు డెవలప్ చేసుకుంటున్నారని అన్నారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రం ఇక‌పై బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచ‌డం ఉండ‌దు

Revanth Reddy : అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రం.. ఇక‌పై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచ‌డం ఉండ‌దు..!

Revanth Reddy అల్లు అర్జున్ వివాదం ఇంకా స్ట్రాంగ్ గా మారేలా ఉంది..

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే అల్లు అర్జున్ వివాదం ఇంకా స్ట్రాంగ్ గా మారేలా ఉంది తప్ప ఇప్పుడప్పుడే సర్ధుమనిగేలా లేదనిపిస్తుంది. అంతేకాదు పోలీసులు రావొద్దన్నా కూడా అక్కడకి వచ్చినందుకు అల్లు అర్జున్ మీద ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మళ్లీ కేసు మొదలు పెడితే ఈసారి అల్లు అర్జున్ ని నిజంగానే జైలులో వేస్తారని తెలుస్తుంది.

ఏది ఏమైనా సినిమా వాళ్ల మీద.. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇష్యూ మీద రేవంత్ రెడ్డి ఇంత గట్టిగా ఉండటం సినీ లవర్స్ ని ఆశ్చర్యపరుస్తున్నా కామన్ మ్యాన్ కి మాత్రం సూపర్ అనిపించేలా ఉంది. ఐతే ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది చెప్పడం కష్టమని చెప్పొచ్చు. అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది