Allu Arjun : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిన కూడా ఆ క్రెడిట్ అంతా రాఘవేంద్రరావు అకౌంట్ లో పడిపోయింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకుడుగా పరిచయమైన ఆర్య సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. అక్కడినుంచి తనకంటూ కొంతమంది ఫ్యాన్స్ ను సాధించుకున్నాడు. వరుసగా మంచి మంచి సినిమాలు ఎంచుకుంటూ మంచి గుర్తింపును సాధించాడు. అయితే ఇటీవల అల్లు అర్జున్ చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.
మై డియర్ ఫ్యాన్స్. నా ఫ్యాన్స్. ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ నాకు పిచ్చి. ఎవరైనా ఏదైనా హీరో చూసి ఫ్యాన్స్ అవుతారు. కానీ నా ఫ్యాన్స్ చూసి నేను హీరో అయ్యాను. నా ఫ్యాన్స్. నా ఆర్మీ కి లవ్ యూ లవ్ యూ అంటూ ఊగిపోయాడు అల్లు అర్జున్. నా సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అయింది. కానీ నాపై మీ ప్రేమ తగ్గలేదు అంటూ కామెంట్ చేశాడు. ఇక ముందు నా సినిమాల విషయంలో ఆలస్యం జరగదు. ఇంకోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇంకా ఎక్కువ సినిమాలు చేస్తా. ఎక్కువ సార్లు కనిపిస్తా. కానీ నాపై మీ ప్రేమ తరగలేదు. ఈ ఫంక్షన్‌కు వచ్చి పెద్ద హిట్ చేసిన అభిమానులు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.
అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ గురించి ఫ్యాన్స్ అడిగినప్పుడు, చెప్పను బ్రదర్ అన్నాడు బన్నీ. అక్కడినుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ కు యాంటీ అయిపోయారు. నంద్యాలలో ఒక వైసీపీ కాండిడేట్ కి సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ అక్కడికి వెళ్లారు. ఇది చాలామంది అభిమానులకి జీర్ణించుకోలేని విషయంగా మారింది. తెలుగు మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. మొత్తానికి ఎట్టకేలకు దీని గురించి స్పందించాడు అల్లు అర్జున్. నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తా అంటూ నిన్న జరిగిన మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ఈవెంట్ లో మాట్లాడారు. బన్నీ ఈ వ్యాఖ్యలు సినిమా గురించి మాట్లాడినా కూడా, ఇన్ డైరెక్ట్ గా నంద్యాల ఇష్యూ గురించి క్లారిటీ ఇచ్చాడని అభిప్రాయపడుతున్నారు.ఇప్పుడు ఈ విషయం మెగా, అల్లుల మధ్య పెద్ద సమస్యగా మారనుందని భావిస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.