Allu Arjun : అల్లు అర్జున్@125.. నిర్మాతలు సమ్మె చేసి ప్రయోజనం ఏముంది?
Allu Arjun : టాలీవుడ్ నిర్మాతలు బడ్జెట్ పెరిగి పోతుంది.. సినిమాలను నిర్మించడం మా వల్ల కావడం లేదు బాబోయ్ అంటూ సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ లు నిలిచి పోయి వారం రోజులు అవుతుంది. షూటింగ్ లు మళ్లీ ఎప్పటికి పునః ప్రారంభం అయ్యేది క్లారిటీ లేదు. షూటింగ్ లను ప్రారంభించాలంటే హీరోల పారితోషికాలు తగ్గించుకోవాల్సిందే.. వారి యొక్క భారీ ఖర్చులు తగ్గించుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. షూటింగ్ లు ప్రారంభం అయ్యేది ఎప్పుడో తెలియడం లేదు కాని మరో వైపు హీరోల తమ పారితోషికాలు మాత్రం మరింతగా పెంచేస్తూనే ఉన్నారు.
పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ 40 కోట్ల పారితోషికం తీసుకుని కొంత మొత్తం ను లాభంగా తీసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు గాను ఏకంగా 125 కోట్ల రూపాయలను ఆయన డిమాండ్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 సినిమా యొక్క బడ్జెట్ ను 250 నుండి 300 కోట్లు గా అనుకుంటున్నారట. అందులో బన్నీ పారితోషికం రూ. 125 కోట్లు ఉండాల్సిందే అంటున్నారట. బన్నీ పుష్ప తో నిజంగానే జాతీయ స్థాయిలో స్టార్ అయ్యాడు. ఆయనకు భారీ గా పారితోషికం ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు.
ఒక వైపు నిర్మాతలు పారితోషికాలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉంటే మరో వైపు బన్నీ ఈ స్థాయి పారితోషికం ను డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంద కోట్ల పారితోషికంను ఎక్కువ అంటూ ఉంటే ఆయన 125 కోట్లు డిమాండ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ చేస్తున్న ఈ డిమాండ్ తో నిర్మాతల యొక్క సమ్మె ప్రయోజనం ఏంటంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి పెద్ద నిర్మాత అయినా కూడా బన్నీ ఇలా ఎందుకు డిమాండ్ చేస్తుండని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.