
Allu Arun Did Not Attend Pushpa 2 Pooja Ceremony
Allu Arun : మొన్నటి వరకు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. పుష్ప సినిమా బన్నీకి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాయి. ర్ర చందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు ఓ రేంజ్‌లో స్వాగ్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు మొదలవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూడగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి నేడు(సోమవారం)పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ కనిపించలేదు.
అందుకు కారణం ఆయన న్యూయార్క్‌లో ఉండడం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. యూఎస్ఏలోని న్యూయార్క్ లో ప్రతి సంవత్సరం నిర్వహించే ‘ఇండియా డే’ పరేడ్ కు ఈ ఏడాదికి యావత్ భారత్ దేశానికి ప్రతినిథ్యం వహిస్తూ గ్రాండ్ మార్షల్ హోదాలో అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈసారి 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో గ్రాండ్ గా కావాతు నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీకి న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఘన స్వాగతం పకలికారు.
Allu Arun Did Not Attend Pushpa 2 Pooja Ceremony
అలాగే ఈ పరేడ్ కు దాదాపు ఐదు లక్షల మందికి పైగా భారతీయలు వచ్చి, భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, ఐకాన్ స్టార్ పై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ స్థాయిలో న్యూయర్క్ డే పరేడ్ కు ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ఇండియా డే పరేడ్ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు.ఇక పుష్ప 2 విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నానే హీరోయిన్‌గా నటించనుంది. అయితే ఆమె పాత్ర నిడివి తగ్గనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.