Thaman : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో థమన్ ఒకరు. ఇటీవలి కాలంలో ఆయన సంగీతం అందించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగుంటుంది. అయితే ఇక్కడే చిన్న సమస్య వచ్చిపడింది. ఆయన సంగీతంలో కొత్తదనం కావాలంటే.. ఆ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ అవ్వాలా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. అందుకు కారణం ఆదివారం విడుదలైన ‘గాడ్ ఫాదర్’ సినిమా టీజర్. ఈ టీజర్ చూశాక నెటిజన్లకి ఆ మ్యూజిక్ ఎక్కడో వినినట్లుగా ఉంది అనుకుంటూ సెర్చింగ్ మొదలెట్టి.. ఆఖరికి ‘గని’ దగ్గర ఆగిపోయారు.
టీజర్ లో బిజియం గమనిస్తే వరుణ్ తేజ్ డిజాస్టర్ మూవీ గని బిజియం గుర్తుకు వస్తోంది. గని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని గాడ్ ఫాదర్ చిత్రానికి రిపీట్ చేసారు అంటూ తమన్ పై అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఫ్లాప్ సినిమా బిజియంనే మళ్ళీ రిపీట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి అవధులు లేకుండా పోయింది. ఇలాంటి తప్పు జరగకుండా తమన్ ఇకనైనా జాగ్రత్త తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. చిరంజీవి చివరగా నటించిన ఆచార్య చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీనితో గాడ్ ఫాదర్ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తమన్ సంగీతంలో కాపీ అనే మాట కచ్చితంగా వస్తుంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఇదే మాట ఎక్కడో దగ్గర వినిపిస్తుంది. దీంతో కాపీ ట్రోలింగ్ తమన్‌కి కూడా అలవాటు అయిపోయింది. మరీ అడిగితే.. నా మ్యూజిక్ నేనే మళ్లీ కొట్టాను, వేరే వాళ్లది కాదు కదా అని కూడా అంటాడు. త్రివిక్రమ్ అలా వైకుంఠపురములో చిత్రం కోసం మాత్రం థమన్ ప్రత్యేక సంగీతం అందిచాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇటీవల వచ్చిన మహేష్ పేరుతో మ మ మహేషా అంటూ సాగుతున్న ఆ సాంగ్ మీద కాపీ ఆరోపణలు వచ్చాయి. ఈ పాట మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమా కోసం రూపొందించిన విషయం తెలిసిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.