Allu Sneha Reddy : నువ్ పక్కన ఉంటే చాలు.. బన్నీతో స్నేహారెడ్డి ఫుల్ ఎంజాయ్.. వీడియో
Allu Sneha Reddy టాలీవుడ్ ఐకాన్ స్టార్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో గత కొన్ని రోజుల క్రితం మాల్దీవులకు వెళ్లిన బన్నీ.. ఇంకా అక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు. మా ఎన్నికల్లో పాల్గొనకుండా అక్కడికి వెళ్లిపోయాడు. అయితే ఈ వెకేషన్‌ను ముందే ప్లాన్ చేసుకున్నాడు. అందుకే అలా వెళ్లిపోవాల్సి వచ్చిందని అంటున్నారు. మొత్తానికి అల్లు ఫ్యామిలీ మా ఎన్నికలకు దూరంగానే ఉంది. ఆ విషయం అలా ఉంచితే.. మాల్దీవుల్లో బన్నీ ఫ్యామిలీ దుమ్ములేపుతోంది.
అయాన్, అల్లు అర్జున్ కలిసి సైకిల్ తొక్కుతూ అక్కడి ప్రదేశాలను చుట్టేస్తున్నారు. ఇక అర్హ, స్నేహారడ్డి మాత్రం స్విమ్మింగ్ పూల్, బీచ్‌లంటూ తిరుగుతున్నారు. ఈ నలుగురు ఇప్పుడు మాల్దీవుల్లో నానా హంగామా చేస్తున్నారు. అక్కడి విశేషాలు, అక్కడి వెకేషన్ సంగతులను అల్లు స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు నెట్టింట్లో షేర్ చేస్తూనే ఉంది. అభిమానులను అప్డేట్ చేస్తూనే వస్తోంది. తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది. అందులో బన్నీతో స్నేహారెడ్డి ఓ సెల్ఫీ వీడియో తీసినట్టు కనిపిస్తోంది.
Allu Sneha Reddy మాల్దీవుల్లో బన్నీతో స్నేహారెడ్డి
బన్నీ, స్నేహారెడ్డి అలా క్లోజ్‌గా ఉన్నారు. నువ్ పక్కన ఉంటే ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటుందన్నే ఉద్దేశ్యంలో స్నేహారెడ్డి ఓ పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆమె చెప్పిన కొటేషన్, షేర్ చేసిన వీడియో రెండూ వైరల్ అవుతున్నాయి. నువ్ నా పక్కన ఉంటే అన్నీ మంచిగానే అనిపిస్తాయ్ అని స్నేహారెడ్డి తన భర్త మీదున్న ప్రేమను బయటపెట్టేసింది. మాల్దీవులు, వెకేషన్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లను షేర్ చేసింది. ఇక ఫ్యామిలీయే ఫస్ట్ తరువాతే ఏదైనా అంటూ స్నేహారెడ్డి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.