Ram Charan : గేమ్ చేంజర్ పై అమెజాన్ ప్రైమ్ కామెడీ.. మెగా ఫ్యాన్స్ అంతా గుర్రు మీద ఉన్నారుగా..!
ప్రధానాంశాలు:
Ram Charan : గేమ్ చేంజర్ పై అమెజాన్ ప్రైమ్ కామెడీ.. మెగా ఫ్యాన్స్ అంతా గుర్రు మీద ఉన్నారుగా..!
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా Game Changer గేమ్ చేంజర్. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. కియరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో థమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా థియేట్రికల్ వెర్షన్ పెద్దగా ఆకట్టుకోలేదు కానీ ఓటీటీలో అయినా ప్రేక్షకులను అలరిస్తుందని మెగా ఫ్యాన్స్ అనుకున్నారు. Ram Charan గేమ్ చేంజర్ సినిమా అమెజాన్ ప్రైం వీడియోలో రీసెంట్ గా రిలీజైంది. ఐతే సినిమాను Amazon Prime అమెజాన్ ప్రైంలో ప్రమోట్ చేసే విధానం మెగా ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. ప్రైం సోషల్ మీడియా ఖాతాల్లో గేమ్ చేంజర్ గురించి ప్రమోట్ చేస్తూ రకరకాల వీడియోస్ చేస్తున్నారు. అవి సినిమా గురించి చాలా కామెడీగా చేసినట్టు అనిపిస్తుంది. సినిమా ఎంతో సీరియస్ పాయింట్ తో తెరకెక్కించి ఆ సీన్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ కాగా ఊయ్ అంటూ కామెడీ సౌండ్ పెట్టి దాన్ని వదలడంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా హర్ట్ అయ్యి అమెజాన్ ప్రైం మీద ఫైర్ అవుతున్నారు.

Ram Charan : గేమ్ చేంజర్ పై అమెజాన్ ప్రైమ్ కామెడీ.. మెగా ఫ్యాన్స్ అంతా గుర్రు మీద ఉన్నారుగా..!
Ram Charan : థియేటర్ లో ఫ్లాప్ టాక్ తెచుకున్నా..
స్టార్ సినిమాలు థియేట్రికల్ వెర్షన్ తో సంబందం లేకుండా ఓటీటీ రిలీజ్ లు మెప్పిస్తాయి. కొన్ని సినిమాలు థియేటర్ లో ఫ్లాప్ టాక్ తెచుకున్నా డిజిటల్ రిలీజ్ లో సినిమా బాగానే ఉందిగా అనిపించేస్తాయి. గేమ్ చేంజర్ విషయంలో కూడా సినిమా చూసిన ఆడియన్స్ సినిమా మరీ అంత వరస్ట్ గా ఏమి లేదని అంటున్నారు. ఐతే అమెజాన్ ప్రైం మాత్రం కావాలని కామెడీ చేస్తూ ఫ్యాన్స్ ని ఇబ్బందికి గురి చేస్తున్నాడు.
సినిమాను ప్రమోట్ చేయడం అంటే ఆ సినిమాకు కలిసి వచ్చేలా చేయాలి కానీ ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా యాంటీ ఫ్యాన్స్ కి అవకాశం ఇచ్చేలా చేయకూడదు. ఏది ఏమైనా గేమ్ చేంజర్ లెక్కలు తప్పినా సరే మెగా ఫ్యాన్స్ ఈ సినిమా ఓటీటీలో రిలీజై అక్కడ ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందనకు సంతోషంగా ఉన్నారు. కానీ అమెజాన్ ప్రైం చేస్తున్నా వెకిలి కామెడీ అనవసరమైన అత్యుత్సాహం అనేది ఫ్యాన్స్ జోష్ ని హరించివేస్తుంది. Shankar, Dil Raju, Kiara Advani