అప్పట్లోనే చిరు నుంచి పిలుపు.. అమ్మ రాజశేఖర్ క్లారిటీ
ప్రస్తుతం ఎక్కడ చూసినా రీమేక్ చిత్రాల గోల ఎక్కువైంది. మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లోకి తెరకెక్కుతున్నాయి. ఇతర భాషల్లో తెరకెక్కిన చిత్రాలు మన తెలుగులో రీమేక్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చిరంజీవి వరుసబెట్టి రీమేక్‌లను ఓకే చేస్తున్నాడు. అందులో మలయాళం లూసిఫర్, తమిళ వేదాళం ఉన్నాయి. వీటిపై చిరంజీవి అధికారిక ప్రకటన కూడా చేసేశాడు. ఇక ఈ రీమేక్‌లపై అమ్మ రాజశేఖర్ కామెంట్ చేశాడు.

Amma Rajasekhar about Chiranjeevi Remake Movies
మామూలుగా అమ్మ రాజశేఖర్ గురించి బిగ్ బాస్ స్టేజ్ మీద చిరంజీవి బాగానే మాట్లాడట. కానీ మనకు మాత్రం కొంత చూపించారు. రణం సినిమా చేయడానికి చాలా ఏళ్ల ముందే ముందే రాజశేఖర్‌లో ఒక దర్శకుడు ఉన్నాడని గుర్తించాను. నాతో సినిమా చేయమని రూ.15 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను. కానీ, ఇప్పటి వరకు ఆయన నాతో సినిమా మాత్రం చేయలేదంటూ చిరంజీవి స్టేజ్ మీదే చెప్పాడట. దీనికి అమ్మ కూడా ఒప్పుకుని అనివార్య కారణాల వల్ల కుదరలేదని చెప్పాడట.
ఇప్పుడు అవకాశమిస్తే సినిమా తీస్తానని అన్నారు అమ్మ రాజశేఖర్ అంటే… ఇప్పుడు మళ్లీ అడ్వాన్స్ ఇవ్వనని.. అప్పుడిచ్చినదానికి వడ్డీ కలిపితే కోట్లవుతుందని.. అదే పారితోషకంగా తనతో సినిమా చేయమని చెప్పాడట చిరంజీవి. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఆయన కోసం ‘గబ్బర్ సింగ్‘లాంటి ఎంటర్‌టైనర్ కథ రెడీ చేశానన్నాడు. చిరంజీవి కొత్త కథలతో సినిమాలు చేయాలని, ఆయన లాంటి స్టార్ రీమేక్ చేయడం వల్ల లాభం ఉండదని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఓటీటీలు అందుబాటులో ఉండడం వల్ల అన్ని భాషల సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారని, దీని వల్ల రీమేక్‌లు అంతగా ఆడవని… ఈ విషయంలో చిరు కచ్చితంగా ధైర్యం చేయాలని అమ్మ రాజశేఖర్ సూచించాడు. ఓ లెక్కన అమ్మ రాజశేఖర్ మాట్లాడింది చూస్తే దాంట్లో నిజముందనిపిస్తోంది.