GodFather Movie : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. లూసిఫర్ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుండగా, ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేయగా, అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఈ వేడుక జరగనుంది. 28న సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కానుండగా, దీనికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ ఈవెంట్‌కి గెస్ట్‌లు ఎవరు రారని, చిత్ర బృందం మాత్రమే హాజరు కాబోతున్నారని అంటున్నారు.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5న ఆడియన్స్ ముందుకు రానుంది.ఈ క్రమంలో ఇటీవల చిరంజీవిని యాంకర్ శ్రీముఖితో వినూత్నంగా విమానంలో ఇంటర్వ్యూ చేసి ఆయన నుండి పలు విషయాలు రాబట్టింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల కానుండగా, ఇందులో ఆసక్తికర క్లిప్ మెగా ఫ్యాన్స్‌కి కూడా మాంచి కిక్ అందించనుందట. చిత్రంలో సల్మాన్ కీలక పాత్ర పోషించగా, ఆయన చెప్పిన తెలుగు డైలాగ్ ట్రైలర్‌లో ఉండేలా ప్లాన్ చేశారని ఇన్‌సైడ్ టాక్. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ ఆనందం అవధులు దాటడం ఖాయం.
చిత్రానికి సంబంధించిన ఫైనల్ ఫుట్ పుట్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ ఫైనల్ కాపీని మెగాస్టార్ చిరంజీవి చూశారని ఇన్ సైడ్ టాక్. గాడ్ ఫాదర్ ఫైనల్ కాపీని మెగాస్టార్ తన ఇంట్లోనే వీక్షించారని చెబుతున్నారు. ఈ కాపీ చూసిన తర్వాత మెగాస్టార్ బాగా ఎక్సైట్ అయ్యారని తెలుస్తోంది. ఈ భారీ సినిమాలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ లాంటి బడా స్టార్ భాగం కావడంతో మెగా ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్‌కు ముందే ఓటీటీ డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెలుగు, హిందీ ఓటీటీ హక్కులను 57 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సునీల్ , యాంకర్ అనసూయ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.