GodFather Movie : మెగా ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. గాడ్ ఫాద‌ర్ ట్రైల‌ర్‌లో అస‌లు ట్విస్ట్ ఇదా?

Authored By Sam C | The Telugu News | Published on: September 27, 2022, 8:00 pm

GodFather Movie : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాద‌ర్. లూసిఫ‌ర్ రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేయ‌గా, అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. 28న సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కానుండ‌గా, దీనికి సంబంధించి ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. ఈ ఈవెంట్‌కి గెస్ట్‌లు ఎవ‌రు రార‌ని, చిత్ర బృందం మాత్ర‌మే హాజ‌రు కాబోతున్నార‌ని అంటున్నారు.

GodFather Movie : కిక్కిచ్చే న్యూస్..

పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5న ఆడియన్స్ ముందుకు రానుంది.ఈ క్ర‌మంలో ఇటీవ‌ల చిరంజీవిని యాంకర్ శ్రీముఖితో వినూత్నంగా విమానంలో ఇంటర్వ్యూ చేసి ఆయ‌న నుండి ప‌లు విష‌యాలు రాబ‌ట్టింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైల‌ర్ విడుద‌ల కానుండగా, ఇందులో ఆస‌క్తిక‌ర క్లిప్ మెగా ఫ్యాన్స్‌కి కూడా మాంచి కిక్ అందించ‌నుంద‌ట‌. చిత్రంలో స‌ల్మాన్ కీల‌క పాత్ర పోషించ‌గా, ఆయ‌న చెప్పిన తెలుగు డైలాగ్ ట్రైల‌ర్‌లో ఉండేలా ప్లాన్ చేశార‌ని ఇన్‌సైడ్ టాక్. ఇదే నిజ‌మైతే మెగా ఫ్యాన్స్ ఆనందం అవ‌ధులు దాట‌డం ఖాయం.

An Important Twist In The GodFather Movie Trailer

An Important Twist In The GodFather Movie Trailer

చిత్రానికి సంబంధించిన ఫైనల్ ఫుట్ పుట్ రెడీ చేసినట్లు సమాచారం. ఈ ఫైనల్ కాపీని మెగాస్టార్ చిరంజీవి చూశారని ఇన్ సైడ్ టాక్. గాడ్ ఫాదర్ ఫైనల్ కాపీని మెగాస్టార్ తన ఇంట్లోనే వీక్షించారని చెబుతున్నారు. ఈ కాపీ చూసిన తర్వాత మెగాస్టార్ బాగా ఎక్సైట్ అయ్యారని తెలుస్తోంది. ఈ భారీ సినిమాలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ లాంటి బడా స్టార్ భాగం కావడంతో మెగా ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్‌కు ముందే ఓటీటీ డిజిటల్‌ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెలుగు, హిందీ ఓటీటీ హక్కులను 57 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సునీల్ , యాంకర్ అనసూయ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp