Anasuya : గతం ఎంతో ఘనం అన్నట్లుగా జబర్దస్త్ పరిస్థితి మారుతోంది. గతంలో అద్బుతాలు ఆవిష్కరించిన జబర్దస్త్ ఇప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అందుకు కారణం ఏంటీ అనేది మాత్రం ఏ ఒక్కరు కనీసం ఊహించలేక పోతున్నారు. జబర్దస్త్ అంటే ఒక బ్రాండ్ అన్నట్లుగా పేరు దక్కించుకున్న షో కాస్త ఇప్పుడు చాలా మంది లైట్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. టీమ్ లీడర్లు ఎంతో మంది షో ను వదిలేస్తున్నారు.. ఎంతో మంది మంచి వారు షో కు దూరం అయ్యి పక్క ఛానల్ లో సందడి చేస్తూ ఉన్నారు. ఈటీవీలో మల్లెమాల వారు అధిక పారితోషికం ఇస్తే పక్కకు చూడాల్సిన అవసరం ఏంటీ అనేది కొందరి ప్రశ్న.
జబర్దస్త్ నుండి ఆరంభంలో కొందరు టీమ్ లీడర్లు వెళ్లి పోయినా కూడా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, అదిరే అభి ఇంకా కొందరు షో ను నెట్టుకు వచ్చారు. వారి వల్ల మంచి రేటింగ్ అయితే దక్కింది. ఇప్పుడు వారు కూడా వెళ్లి పోతున్నారు. అదిరే అభి వెళ్లి చాలా కాలం అయ్యింది. మరో వైపు ఇటీవలే ఆది వెళ్లి పోయాడు. మంత్రి పదవి రావడంతో రోజా కూడా జబర్దస్త్ నుండి బయటకు వెళ్లారు. ఇటీవలే సుధీర్ కూడా బయటకు వచ్చేశాడు. దాంతో జబర్దస్త్ పనైపోయినట్లే అంటూ అంతా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో జబర్దస్త్ కు గుడ్ బై అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
సుధీర్.. ఆది లేకుండా షో ను నడిపించడం అంత సులువు కాదు.. అలాంటిది ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా పక్క చూపులు చూస్తోంది. చాలా కాలంగా ఆమె ఈటీవీలో పార్ట్ టైమ్ అన్నట్లుగానే యాంకర్ గా చెస్తోంది. ఇప్పుడు ఆ పార్ట్ టైమ్ కూడా వదిలేసిందని తెలుస్తోంది. యాంకర్ గా జబర్దస్త్ షో ను చేసిన అనసూయ త్వరలోనే గుడ్ బై చెప్పబోతుంది. ఎందుకంటే రెండు ఎపిసోడ్ లు గా వస్తున్న జబర్దస్త్ ను ఒక్క ఎపిసోడ్ గా కుదించేయబోతున్నారట. దాంతో ఆ ఒక్క ఎపిసోడ్ కు రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేయబోతుంది.. మరో యాంకర్ అయిన అనసూయ పక్క ఛానల్ కు జంప్ అవ్వబోతుంది. ఇంకా ఎంత మంది ఈ జాబితాలో చేరుతారో చూడాలి.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్‌డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.