Sarkaru Vaari Paata : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమాకు ఆయన కూడా ఓ నిర్మాత. అలాగే, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన బయోపిక్ సినిమా మేజర్‌కు ఆయన నిర్మాణంలో భాగస్వామి. అయితే, మేజర్ సినిమా విషయంలో కరెక్ట్‌గా
ఆలోచించిన మహేశ్, సర్కారు వారి పాట సినిమా విషయంలో మాత్రం రాంగ్ స్టెప్ వేశారని చెప్పుకుంటున్నారు. గత నెల 12న సర్కారు వారి పాట సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను జీఎంబీ, 14 రీల్స్
ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించాయి.
అంటే, ఈ మూవీకి లాభాలొచ్చినా, నష్ఠాలు వచ్చినా ముగ్గురు భరించాలి. గత కొన్నేళ్ళుగా వరుస విజయాలను అందుకున్న మహేశ్‌కు సర్కారు వారి పాట సినిమాతో ఫ్లాప్ పడిందని డిసైడ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజై ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుంది. అయినా బ్రేకీవెన్‌కు ఆమడ
దూరంలో ఉండిపోయింది. ఓవరాల్‌గా 109.17 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ సినిమాకు అయిన బిజినెస్ 121 కోట్లు. దాన్ని బట్టి చూస్తే ఇంకా 11 కోట్లకు పైగానే రాబట్టాల్సి ఉంది. అందుకే, తాజాగా సర్కారు వారి పాట సినిమాలో మహేశ్ – కీర్తిలపై చిత్రీకరించిన ‘మురారి బావ’ సాంగ్‌ను యాడ్
చేశారు. ఇక్కడిదాకా బాగానే ఉంది.
దీని తర్వాతే మహేశ్ రాంగ్ స్టెప్ వేశారు. ‘మురారి బావా’.. పాటను థియేటర్స్‌లో యాడ్ చేసి ఒక్కరోజు కూడా గడవకముందే ఓటీటీలో పే ఫర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేశారు. ఇలా అనూహ్యంగా సర్కారు వారి పాట సినిమా ఓటీటీలో Rs.199 రూపాయలు కట్టి చూడటం అంటే అందరూ కలిసి ఇంట్లోనే
కూర్చొని చూస్తారు తప్ప ఇక థియేటర్స్‌కు వెళ్ళాల్సిన అవసరం ఏముందీ అనే ఆలోచనలోకి వచ్చేశారు. ఇంకొన్ని రోజులు థియేటర్స్‌లో సందడి చేసి బ్రేకీవెన్ రీచ్ అవ్వాలనే ‘మురారి బావా’ సాంగ్‌ను యాడ్ చేసింది. అలా కాకుండా అటు థియేటర్స్‌లో పాట యాడ్ చేసి ఇటు పే ఫర్ వ్యూ అంటే ఇక
థియేటర్స్‌కు ఎవరూ వెళ్ళరని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అంటే తన సినిమా విషయంలో తానే రాంగ్ స్టెప్ వేశారు మహేశ్. మరి మహేశ్ స్ట్రాటజీ ఏంటో ఆయనకే తెలియాలి.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.