Anasuya : ఆది..రోజా.. సుధీర్‌ ఇప్పుడు అనసూయ.. వెళ్లగొడుతున్నారా? వెళ్లి పోతున్నారా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 4, 2022, 6:00 pm

Anasuya : గతం ఎంతో ఘనం అన్నట్లుగా జబర్దస్త్‌ పరిస్థితి మారుతోంది. గతంలో అద్బుతాలు ఆవిష్కరించిన జబర్దస్త్‌ ఇప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అందుకు కారణం ఏంటీ అనేది మాత్రం ఏ ఒక్కరు కనీసం ఊహించలేక పోతున్నారు. జబర్దస్త్‌ అంటే ఒక బ్రాండ్‌ అన్నట్లుగా పేరు దక్కించుకున్న షో కాస్త ఇప్పుడు చాలా మంది లైట్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. టీమ్ లీడర్లు ఎంతో మంది షో ను వదిలేస్తున్నారు.. ఎంతో మంది మంచి వారు షో కు దూరం అయ్యి పక్క ఛానల్ లో సందడి చేస్తూ ఉన్నారు. ఈటీవీలో మల్లెమాల వారు అధిక పారితోషికం ఇస్తే పక్కకు చూడాల్సిన అవసరం ఏంటీ అనేది కొందరి ప్రశ్న.

జబర్దస్త్‌ నుండి ఆరంభంలో కొందరు టీమ్‌ లీడర్లు వెళ్లి పోయినా కూడా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, అదిరే అభి ఇంకా కొందరు షో ను నెట్టుకు వచ్చారు. వారి వల్ల మంచి రేటింగ్‌ అయితే దక్కింది. ఇప్పుడు వారు కూడా వెళ్లి పోతున్నారు. అదిరే అభి వెళ్లి చాలా కాలం అయ్యింది. మరో వైపు ఇటీవలే ఆది వెళ్లి పోయాడు. మంత్రి పదవి రావడంతో రోజా కూడా జబర్దస్త్‌ నుండి బయటకు వెళ్లారు. ఇటీవలే సుధీర్ కూడా బయటకు వచ్చేశాడు. దాంతో జబర్దస్త్‌ పనైపోయినట్లే అంటూ అంతా చర్చించుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో జబర్దస్త్‌ కు గుడ్‌ బై అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

Anasuya also leaving etv mallemala jabardasth comedy show

Anasuya also leaving etv mallemala jabardasth comedy show

సుధీర్‌.. ఆది లేకుండా షో ను నడిపించడం అంత సులువు కాదు.. అలాంటిది ఇప్పుడు యాంకర్‌ అనసూయ కూడా పక్క చూపులు చూస్తోంది. చాలా కాలంగా ఆమె ఈటీవీలో పార్ట్‌ టైమ్‌ అన్నట్లుగానే యాంకర్ గా చెస్తోంది. ఇప్పుడు ఆ పార్ట్‌ టైమ్‌ కూడా వదిలేసిందని తెలుస్తోంది. యాంకర్ గా జబర్దస్త్‌ షో ను చేసిన అనసూయ త్వరలోనే గుడ్‌ బై చెప్పబోతుంది. ఎందుకంటే రెండు ఎపిసోడ్‌ లు గా వస్తున్న జబర్దస్త్‌ ను ఒక్క ఎపిసోడ్‌ గా కుదించేయబోతున్నారట. దాంతో ఆ ఒక్క ఎపిసోడ్‌ కు రష్మీ గౌతమ్‌ యాంకరింగ్ చేయబోతుంది.. మరో యాంకర్ అయిన అనసూయ పక్క ఛానల్‌ కు జంప్ అవ్వబోతుంది. ఇంకా ఎంత మంది ఈ జాబితాలో చేరుతారో చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp