4K HD smart TVs with the latest features
Smart TVs : ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చాక టీవీల డిమాండ్ బాగా పెరిగింది. కరోనా పాండమిక్ టైమ్ లో చాలా మంది ఇంట్లోనే ఉండటంతో ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలు చూడటానికి అలవాటు పడ్డారు. స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ వర్షన్ లు అందుబాటులో ఉండటంతో నెట్ ఫ్లిక్స్, పైమ్ వీడియో, యూట్యూబ్ వంటి వాటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ బడ్జెట్ లో 4కే అల్ట్రా హెచ్ డీ టీవీలు కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. బడ్జెట్ లో 50 ఇంచెస్ టీవీలకు మరింత డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ని బట్టి రెడ్ మీ, ఎంఐ, వన్ ప్లస్ వంటి కంపెనీలు బెస్ట్ మోడల్స్ ని లాంచ్ చేస్తున్నియి. కాగా బడ్జెట్ లో బెస్ట్ అండ్రాయిడ్ టీవీలు ఇప్పుడు చూద్దాం… ఎంఐ టీవీ 4ఎక్స్ 50 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ టీవీ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వంటి వాటిలో ఆఫర్ తో లభిస్తుంది. 4కే అల్ట్రా హెచ్‌డీ రెజల్యూషన్ (3840×2160 పిక్సెల్స్), హెచ్ డీ ఆర్ 10 సపోర్ట్, 10 బిట్ డిస్‌ప్లే తో అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ సపోర్ట్, గూగుల్ ప్లే వంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే స్టోరేజ్2జీబీ ర్యామ్ + 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. కనెక్టివిటీ కోసం 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్, ఆడియో జాక్ సౌండ్ ఔట్‌పుట్ 20వాట్స్, డాల్బీ+ ఆడియో, డీటీఎస్-హెచ్‌డీ సపోర్ట్ తో అందుబాటులో ఉంది. దీని ధర ప్రస్తుతం రూ.35,999గా ఉంది. నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ+హాట్ స్టార్ వంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే 4కే అల్ట్రా ఎచ్ డీ రెజల్యూషన్ (3840×2160 పిక్సెల్స్), హెచ్ డీఆర్ 10 సపోర్ట్, మైక్రో డిమ్మింగ్ సపోర్ట్ తో ఐఫాల్కన్ 50 ఇంచుల 4కే అల్ట్రా హెచ్‌డీ టీవీ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ , గూగుల్ వాయిస్ అసిస్టెంట్స్, క్రోమ్‌కాస్ట్ సపోర్ట్, గూగుల్ ప్లే సపోర్ట్ తో, 2జీబీ ర్యామ్ + 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో కొనుగోలు చేయవచ్చు. కనెక్టివిటీ కోసం 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్ ఫీచర్స్ ఉన్నాయి.
4K HD smart TVs with the latest features
సౌండ్ ఔట్‌పుట్ 24వాట్లు, డాల్బీ ఆడియో, సరౌండ్ విజువలైజర్ సపోర్ట్ తో రూ.30,999 కి అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ యూ సిరీస్ 4 కే యూహెచ్ డీ స్మార్ట్ టీవీ అమెజాన్ లో అందుబాటులో ఉంది. 50 ఇంచెస్ స్క్రీన్ సైజ్, 4కే అల్ట్ర ఎచ్ డీ రెజల్యూషన్ తో(3840×2160 పిక్సెల్స్), ఎచ్ డీఆర్ 10, 10+, ఎచ్ జీ ఎల్ సపోర్ట్, గామా ఇంజిన్, ఓఎస్ ఆండ్రాయిడ్ 10, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్, గూగుల్ ప్లే, స్టోరేజ్ 2జీబీ ర్యామ్ +16జీబీ స్టోరేజ్ ఉంది. కనెక్టివిటీ కోసం 3 హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్‌బీ పోర్ట్‌లు, ఆడియో జాక్, వైఫై, బ్లూటూత్ ఫీచర్లు ఉన్నాయి. సౌండ్ ఔట్‌పుట్ 30 వాట్స్, డాల్బీ ఆడియో సపోర్ట్, డైనాడియో ఫీచర్స్ తో రూ.40,999కి కొనుగోలు చేయవచ్చు. దాదాపు ఇవే ఫీచర్స్ తో టీసీఎల్ 50 ఇంచెస్ 4కే యూహెచ్‌డీ స్మార్ట్ టీవీ రూ. 39,990 కి కొనుగోలు చేయవచ్చు.
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.