ప్యాంట్ వేసుకుంటే ఇంకా బాగుండేది.. అనసూయపై నెటిజన్ల ట్రోలింగ్
అనసూయ నిత్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంటుంది. తాజాగా అనసూయ తన కుమారులతో కలిసి క్యూట్ స్టెప్పులు వేసింది. ముక్కాల ముక్కాబులా అనే క్లాసిక్ సాంగ్‌కు ప్రభుదేవా ఐకానిక్ స్టెప్పులు వేశారు. అయితే అనసూయ ఎంత క్యూట్‌గా స్టెప్పులు వేసింది అనేది ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అనసూయ వేసుకున్న డ్రెస్‌పై అందరి చూపులు పడ్డాయి. అలా పడాలనే అనసూయ తాపత్రయమై ఉంటుంది.

Anasuya Bharadwaj Dance with Her Sons
అయితే అనసూయ ఏ ఉద్దేశ్యంలో అలాంటి బట్టలు వేసుకుంటుందన్నది ఎవ్వరికీ తెలియదు. కానీ అనసూయ వస్త్రాధారణ మాత్రం నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. అనసూయ వేసుకున్న దుస్తులపై సెటైర్లు పడుతున్నాయి. చిన్న నిక్కర్ వేసుకుని అనసూయ వేసిన కుప్పి గంతులు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అనసూయ వస్త్రాధారణను ఏకిపారేస్తున్నారు.
ప్యాంట్ మరీ పెద్దగా అయిందని ఒకరు సెటైర్ వేస్తూ.. షర్ట్ బాగుంది. ప్యాంట్ వేసుకుంటే ఇంకా బాగుండేదంటూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం స్టైల్లో కామెంట్లు పెట్టేశారు. ఇంకొందరు ఏకంగా అక్కడి టేబుల్ మీద మందు బాటిల్ ఉందని, దాన్ని ఎందుకు కవర్ చేశారని ప్రశ్నలు వేశారు. మొత్తానికి అనసూయ తన కొడుకులతో చేసిన ఈ ఫన్నీ ఫీట్ నెట్టింట ఇంతటి చర్చకు దారి తీసింది. ఏది ఏమైనా అనసూయ మామూల్ది కాదు.
View this post on Instagram