Anasuya Bharadwaj : నిన్ను తిట్టాలంటే కూడా నాకే సిగ్గుగా ఉంది.. నెటిజన్‌పై అనసూయ ఆగ్రహం
Anasuya Bharadwaj : సోషల్ మీడియాలో అనసూయకు ఎదురయ్యే ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. అనసూయ అందాల ప్రదర్శన, ఆమె చేసే వింత ట్వీట్లు, పెట్టే పోస్ట్‌లపై నిత్యం ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. పబ్లిసిటీ పిచ్చి ఉందంటూ నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అందుకే అంతలా ఓవర్ యాక్షన్ చేస్తుంటుందని దారుణంగా పోస్ట్‌లుపెడుతుంటారు. తాజాగా అలాంటి ఓ ఘటనే జరిగింది. ఎప్పటి వీడియోనో, సంఘటనను ఇప్పుడు ఓ నెటిజన్ గుర్తు చేశాడు.

Anasuya Bharadwaj fires on netizen on abusing
అయ్యే నేను ఈ విషయాన్ని గమనించనే లేదు.. అటెన్షన్ బిచ్ అంటూ దారుణంగా తిట్టేశాడు. అందులో అనసూయ కళ్లు తిరిగిపడిపోయినట్టుంది. ఈవెంట్‌లో ఇలాంటి ఎమోషనల్ విషయాలుంటే బాగా క్లిక్ అవుతుందని అందరికీ తెలిసిందే. అయితే అది నిజంగా జరిగిందో స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. దాని వెనుకున్న కారణం అనసూయకు మాత్రమే తెలుస్తుంది. అలా ఆ నెటిజన్ పాత వీడియోను, సంఘటనను ఇప్పుడు ఇలా గుర్తుకు చేయడంతో అనసూయ రివర్స్ కౌంటర్ వేసింది.
ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన ఈ వీడియోను పట్టుకొని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు. నీతో మాట్లాడటం కూడా దండగ. కానీ నువ్వు మొదలు పెట్టావు. ఇలాంటి వాటికి కౌంటర్ ఇవ్వకపోతే.. ముందు ముందు నీలాంటి వాళ్లు మా పై మరింత బురద జల్లే అవకాశం ఉంది. అందుకే నీకు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకు అంటూ సదురు నెటిజన్ తీరును కడిగిపారిసేంది.
Anasuya Bharadwaj: నెటిజన్‌పై అనసూయ ఆగ్రహం
కామెంట్ చేయడం సులభమే.. ఇద్దరు పిల్లల్నీ కన్నాక ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మీకు తెలుసా? లోబీపి పెరిగిపోతోంది.. ఆ ఘటన జరిగింది తెల్లవారుఝామున 5 30 నిమిషాలకు. అంతకు ముందు 22 గంటల పాటు నిరంతరంగా షూట్ చేస్తూనే ఉన్నాం.. కానీ అలాంటివన్నీ గమనించావా? అంటూ కౌంటర్ వేసింది. అయినా నన్ను బిచ్ అని తిట్టడానికి మూడేళ్ల క్రితం నాటి వీడియోను బయటకు తీసే పని పెట్టుకున్నావా? నిన్ను తిట్టాలంటే కూడా నాకే సిగ్గుగా ఉందంటూ అనసూయ శివాలెత్తింది.