Anasuya : అనసూయపై ట్రోల్స్.. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకొని మాట్లాడండి అంటూ ఫైర్
Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ నటిగాను, యాంకర్‌గాను ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతూనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది. కొన్ని సార్లు తాను చేసే కామెంట్స్ లేదంటే షేర్ చేసే ఫొటో వలన కూడా విమర్శలతో పాటు ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనసూయ అందరికీ రిపబ్లిక్ డే విషెష్ చెబుతూ ఎంతో అందంగా పాట పాడింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన వీడియోలో రెండు ఇబ్బందులు తలెత్తాయి. ఒకటి పాట పాడేటప్పుడు అనసూయ నిల్చోలేదు. ఇక రెండోది.. టీషర్ట్ మీద గాంధీ బొమ్మ ఉండడం.‘వందేమాతరం’ నిల్చొని పాడకుండా కుర్చీలో కూర్చొని కాలుపై కాలు వేసుకొని పాడింది.
అనసూయ పాడిన వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలపడంతో ఈ వీడియోని నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. జాతీయ గేయం అయినా, జాతీయ గీతం అయినా, ఎలాంటి దేశభక్తి సాంగ్స్ అయినా నిల్చొని పాడాలి. ఈ మాత్రం తెలీదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ వీడియోలో అనసూయ గాంధీ బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకోవడంపై కూడా వారు మండిపడ్డారు.తనపై వచ్చిన ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి నిల్చొని పాడాలి అని అన్నవారికి ”నేనే సారీ చెబుతున్నా. ఇదంతా చూస్తుంటే నేను నిల్చోకుండా పాడినందుకు చాలా మంది హర్ట్ అయినట్టున్నారు.
Anasuya : అనసూయనా, మజాకానా..!
కానీ అది మీకు ఏదైనా అర్థాన్ని ఇస్తే, నిలబడి గౌరవం చూపించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి దేశభక్తి గీతాలన్నిటికి నేను గౌరవం ఇస్తాను అని పోస్ట్ చేసింది. అలాగే టీషర్ట్‌పై గాంధీ బొమ్మపై వచ్చిన కామెంట్లకు ”అరే ఏందిరా బై మీ లొల్లి.. నేషనల్ ఆంథమ్ అంటారు. గాంధీకి రాజ్యాంగానికి సంబంధం ఏంటని అంటారు. మరి జనగణమణ ఏంది? ఆగస్ట్ 15, 1947 తర్వాతే జనవరి 26, 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా మాట్లాడండి. హ్యాపీ రిపబ్లిక్ డే” అని అనసూయ తన స్టోరీ లో పోస్ట్ చేసింది.