Anasuya Bharadwaj : అవి చూపులా.. చురకత్తులా.. అనసూయ చూపులపై నెటిజన్ల కామెంట్స్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya Bharadwaj : అవి చూపులా.. చురకత్తులా.. అనసూయ చూపులపై నెటిజన్ల కామెంట్స్!

 Authored By mallesh | The Telugu News | Updated on :21 August 2022,5:20 pm

Anasuya Bharadwaj : టాలీవుడ్‌లో యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లదేనుకుంట.. ఈ అమ్మడు యాంకర్‌గా తన ప్రస్థానం మొదలెట్టి ప్రస్తుతం హీరోయిన్లకు నిద్రలేకుండా చేస్తోంది. టాప్ హీరోయిన్లకు సైతం అనసూయ భయం పట్టుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మూడు పదుల వయస్సు దాటినా అనసూయ తన ఫిట్నెస్‌ మంత్రతో వరుసగా సినిమా ఆఫర్లు కొట్టేస్తుంది.

Anasuya Bharadwaj : హీరోయిన్స్‌కు గట్టి పోటీ..

అనసూయకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా ఆమె మాత్రం ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. తన అంద చందాలతో డైరెక్టర్లు, నిర్మాతలకు సైతం అనసూయ నిద్ర పట్టకుండా చేస్తోందని.. అందుకే వరుసగా సినిమా ఆఫర్లు ఈ అమ్మడి కోసం వెంటబడుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అనసూయ ఉన్నట్టుండి జబర్దస్త్ షో మానేయడానికి కూడా అదే కారణం అని అంటున్నారు. కానీ అనసూయ మాత్రం తనపై పిచ్చిపిచ్చి కామెంట్స్ చేస్తున్నారని, తను ఎంతగా వారించినా అటువంటి సన్నివేశాలను చూపించకుండా ఎడిటింగ్‌లో లేపేసి కేవలం తమకు అనకూలంగా ఉండే కామెడీని ప్రసారం చేస్తున్నారని అనసూయ పేర్కొంది.

Anasuya Bharadwaj Green Saree Photos In Internet

Anasuya Bharadwaj Green Saree Photos In Internet

అందువల్లే ఉన్నపలంగా మల్లెమాల ప్రొడక్షన్ నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొంది. అయితే, తొమ్మిదేళ్లుగా ఇబ్బంది పెట్టని కామెడీ పంచులు ఇప్పుడే ఇబ్బంది పెట్టాయా అంటూ నెటిజన్లు అనసూయను ట్రోల్ చేశారు. అనసూయ తనకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతుండటంతో తన గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. ఏకంగా యాడ్స్ కూడా చేసే స్థాయికి ఎదిగింది. టైం దొరికినప్పుడల్లా తన అందాలతో హాట్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఈ భామ.. తాజాగా ట్రేడిషన్ లుక్‌లో కైపేక్కించే కళ్లతో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. అనసూయ కాటుక కళ్లను చూసి ఇవి చూపులా ..చూరకత్తులా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది