Anasuya Bharadwaj : అనసూయ ముద్దూ ముచ్చట్లు.. యాంకరమ్మ టాలెంట్ ఇదే

Authored By aruna | The Telugu News | Published on: August 17, 2022, 7:20 pm

Anasuya Bharadwaj : అనసూయ తెరపై ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో ఎన్ని కాంట్రవర్సీలు చుట్టుముట్టినా కూడా ఆమెలో ఇంకో కోణం ఉంటుంది. ఆమె జంతు ప్రేమికురాలు. మూగ జీవులంటే అనసూయకు మహా ఇష్టం. అనసూయ ఇంట్లో రకరకాల జంతువులు, పక్షులుంటాయి. ఇప్పటికే అనసూయ ఇంట్లో రెండు పెట్స్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఆ కుక్కలంటే అనసూయకు చాలా ఇష్టం.

ఇక తనసూయ ఇంటి బాల్కనీలో చిలుకలు, పావురాళ్లు ఇలా అన్నీ ఉంటాయి. చిలకతో అనసూయ పెట్టే ముద్దూ ముచ్చట్లు మామూలుగా ఉండవు. అనసూయ మాటలకు ఆ చిలుకలు రియాక్షన్లు ఇస్తుంటాయి. ఇక అనసూయ ముద్దు కోసం చిలుకలు కూడా రెడీగా ఉన్నట్టు కనిపిస్తాయి. తాజాగా అనసూయ తన ఇంట్లోని చిలకలకు పలుకులు నేర్పించినట్టు కనిపిస్తోంది.

Anasuya Bharadwaj KS To Her Pets And Parrots

Anasuya Bharadwaj KS To Her Pets And Parrots

Anasuya Bharadwaj : అనసూయ ముద్దూ ముచ్చట్లు..

తాజాగా అనసూయ తన స్టోరీల్లో వీడియోలను షేర్ చేసింది. అందులో చిలకతో అనసూయ ముచ్చట్లు పెట్టేసింది. చిలక అనసూయకు లిప్ లాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అనసూయ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అనసూయ అసలే ఇప్పుడు ఎక్కువగా హాట్ టాపిక్ అవుతోంది. జబర్దస్త్ వీడటం, దానిపై క్లారిటీ ఇవ్వడం అందరికీ తెలిసిందే.

అనసూయ ప్రస్తుతం వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాతో థియేటర్లోకి రాబోతోంది. అందులో చుక్క అనే స్పెషల్ కారెక్టర్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో అనసూయ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అది అంతగా ఫేమస్ అవ్వలేదు. మరి సినిమాలో అనసూయ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Anasuya Bharadwaj KS To Her Pets And Parrots

Anasuya Bharadwaj KS To Her Pets And Parrots

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp