Anasuya : జడలో మల్లెపూలు.. పింక్ శారీలో మత్తెక్కిస్తోన్న అందాల అనసూయ

Authored By aruna | The Telugu News | Published on: August 6, 2022, 4:20 pm

Anasuya : అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై కాస్త హడావిడి తగ్గించేసింది. మల్లెమాల నుంచి దూరంగా వచ్చింది. జబర్దస్త్ షోను వదిలేసి వచ్చింది. ఇక స్టార్ మాలోని సింగింగ్ షోకు హోస్ట్‌గా వచ్చేసింది. సినిమాల్లో బిజీగా ఉండటంతోనే అనసూయ అక్కడి నుంచి వచ్చేశాను అని చెబుతోంది. కానీ సినిమాల వల్ల బిజీగా ఉంటే.. ఇక్కడ మాత్రం ఎలా చేస్తోందో అర్థం కాదు. అంటే మల్లెమాలతో విబేధాలు, జబర్దస్త్ టీంతో గొడవలు జరిగినందుకు ఇలా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు అనసూయ మాత్రం స్టార్ మాలో సుధీర్‌తో కలిసి దుమ్ములేపుతోంది.

సుధీర్, అనసూయ, మనోలు కలిసి స్టార్ మా సింగింగ్ షోను ముందుండి నడిపిస్తున్నారు. పిల్లలు కూడా అద్భుతంగా పాడుతున్నారు. వారి గాత్రాన్ని ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వారి పాటలు, సుధీర్ అనసూయ ఆటలు షోను బాగానే లేపుతున్నాయి. ఇక ఈ మధ్య అయితే సుధీర్, అనసూయలు కూడా తమ గొంతులను సవరించారు. అనసూయ మనోలు కలిసి పాట పాడారు. చిత్రమ్మ, సుధీర్ కలిసి పాటలు పాడారు. వారి గొంతులు మరీ అంత వినసొంపుగా లేకపోయినా కూడా పాటను పాడేందుకు ట్రై చేశారు.

Anasuya Bharadwaj Latest Pink Saree Pics

Anasuya Bharadwaj Latest Pink Saree Pics

సింగింగ్ షోలో అనసూయ, సుధీర్ చేసే కామెడీలు అయితే బాగానే వైరల్అవుతున్నాయి. వీటన్నంటితో పాటుగా అనసూయ అందాల ప్రదర్శన హైలెట్ అవుతోంది. వింత వింత గెటప్పులతో దర్శనమిస్తోంది. తాజాగా జడలో మల్లెపూలు పెట్టుకుని మత్తెక్కించింది. పింక్ శారీలో తన అందాలను చూపించి అందరికీ మత్తెక్కించేసింది. అనసూయ చీరలో అందాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Anasuya Bharadwaj Latest Pink Saree Pics

Anasuya Bharadwaj Latest Pink Saree Pics

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp