Anasuya : సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు.. వామ్మో అనసూయ మామూల్ది కాదుగా

Authored By aruna | The Telugu News | Published on: August 3, 2022, 6:20 pm

Anasuya : యాంకర్ అనసూయ బుల్లితెరపై ఎంతలా బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. వెండితెరపైనా పలు ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నా కూడా తనకు ఎక్కువ ఆదాయాన్ని, క్రేజ్‌ను ఇచ్చే బుల్లితెరను వదిలి పెట్టుకోవడం లేదు. అందుకే బుల్లితెరపై అనసూయ ఏదో ఒక విధంగా మాత్రం బుల్లితెరపై కనిపిస్తోంది. మల్లెమాలతో జరిగిన విబేధాలతో అలా బయటకు వెళ్లినట్టుంది. మల్లెమాల నుంచి దూరంగా జబర్దస్త్ షోకు యాంకర్‌గా ఉండలేక బయటకు వచ్చింది. అనసూయ బయటకు వచ్చేటప్పుడు కొన్ని కారణాలు చెప్పింది. అనసూయ తన కెరీర్‌లో పెద్ద నిర్ణయం తీసుకుంటున్నానని, అక్కడ కొన్ని మంచి చెడు అనుభవాలున్నాయని, ఇకపై తన ప్రయాణాన్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానంటూ అనసూయ చెప్పుకొచ్చింది.

అలా అనసూయ వేసిన ఆ కొత్త అడుగు స్టార్ మా సింగింగ్ షో. ఈటీవీని వదిలి అనసూయ.. స్టార్ మాలోకి వచ్చింది. అంతకు ముందే సుధీర్ కూడా బయటకు వచ్చాడు. సుధీర్, అనసూయలు కలిసి స్టార్ మాలో సింగింగ్ షోను హోస్ట్ చేస్తున్నారు. ఇక మనో, అనసూయ, సుధీర్ అంతా కూడా అక్కడి బ్యాచే. అనసూయ సింగింగ్ షోకు హోస్ట్‌గా ఉంటోంది కాబట్టి.. తనలోని గాత్ర ప్రతిభను కూడా బయటకు పెట్టేసింది. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు అంటూ పాట పాడేసింది. మనో, అనసూయ కలిసి ఈ పాట పాడారు. ఇందులో అనసూయ పాడిన విధానం, నవ్విన విధానం బాగానే ఉంది. అనసూయలో ఈ టాలెంట్ కూడా ఉందా? అనేట్టు అనిపిస్తోంది.

Anasuya Bharadwaj Songs Sarasalu Chalu Srivaru Song in Star Maa Singing Show

Anasuya Bharadwaj Songs Sarasalu Chalu Srivaru Song in Star Maa Singing Show

మొత్తానికి అనసూయ మాత్రం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరించింది. అనసూయ పేరు మీద పాట ఉండగా.. ఇప్పుడు అనసూయే ఓ పాట పాడేసింది. అనసూయ సినిమాలు వెండితెరపై బెడిసి కొడుతున్నాయి. పుష్పతో ఆమెకు అంత పేరు రాలేదు. దర్జా అనే సినిమా వచ్చింది. కానీ వచ్చినట్టు కూడా ఎవ్వరికీ తెలియదు. డిజాస్టర్‌గా మారింది. ఇక వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాతో రాబోతోంది. అది కూడా అలానే ఉండనున్నట్టు కనిపిస్తోంది. అనసూయ ఎందుకు ఇలాంటి పాత్రలు, సినిమాలు ఎంచుకంటుందో తెలియడం లేదు.

aruna

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp