Anasuya : బ్రా వేసుకోలేదని ట్రోలింగ్.. నటికి మద్దతుగా అనసూయ కౌంటర్

Authored By Cinema Desk | The Telugu News | Published on: July 26, 2021, 4:06 pm

Anasuya సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్సీలు తెర మీదకు వస్తాయో చెప్పలేం. ఎక్కువగా సెలెబ్రిటీల మీద నెటిజన్లు ట్రోలింగ్ చేస్తుంటారు. కొన్ని సార్లు ఆ ట్రోలింగ్‌ సమజంసమే అని అనిపించేలా ఉంటుంది.కానీ ఒక్కో సారి సెలెబ్రిటీలను ఊరికే నెగెటివ్ కామెంట్లతో ఆడుకుంటుంటారు. వారి వస్త్రాధారణ మీద కౌంటర్లు వేస్తుంటారు. మొన్నటికి మొన్న ఓ మరాఠి నటి మీద దారుణమైన కామెంట్లు చేశారు. మరాఠీ నటి హేమంగీ కవి తన ఇంట్లో వంట చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె చపాతీల ఎంతో ఫాస్ట్‌గా చేస్తున్నారు.

anasuya bharadwaj supports hemangi kavi

anasuya bharadwaj supports hemangi kavi

Anasuya అనసూయ కౌంటర్

అయితే చపాతీలు చేసేటప్పుడు శరీరం అంతా కూడా సహజంగానే కదులుతుంది. ఈ క్రమంలో ఆమె ఎద భాగంపై ఆకతాయిల కన్ను పడింది. బ్రా వేసుకోలేదా? ఎందుకు వేసుకోలేదు? అంటూ నానారకాలుగా కామెంట్లు చేశారు. దీంతో నెటిజన్లకు హేమంగీ కవి గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఇలాంటి ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లకు ధీటుగా నిలబడితేనే మిగతా వాళ్లు సైలెంట్‌గా ఉంటారని అనుకున్నారో ఏమో గానీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఆమె చెప్పిన సమాధానానికి అందరూ ఫిదా అవుతున్నారు.

anasuya bharadwaj supports hemangi kavi

anasuya bharadwaj supports hemangi kavi

మగవారికి ఉన్నట్టుగానే మాక్కూడా ఉంటుంది.. అన్ని ఉంటాయి. ఇక కాళ్లు చేతులు కదులుతుంటే దానికి తగ్గట్టుగానే అవి కూడా కదులుతుంటాయి. అలా కదలని వారు ఎవరైనా ఉంటే నాకు చూపించండి. అయినా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలనేది? ఏం ధరించాలి? ఏం ధరించకూడదు అనేది? నా ఇష్టం అని హేమంగీ కవి ధీటుగా కౌంటర్ వేశారు. దీనిపై తాజాగా అనసూయ స్పందించారు. ఇలాంటి ట్రోలింగ్ అనసూయకు కొత్తేమీ కాదు. అందుకే హేమంగీ కవికి మద్దుతుగా నిలిచింది. ఎంతో ధైర్యవంతురాలివి నువ్.. అదిరిపోయేలా జవాబిచ్చావ్ అనేట్టుగా అనసూయ చెప్పుకొచ్చింది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp