Anasuya : జ‌ర్నలిస్ట్‌కి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన అన‌సూయ‌.. ఆ విష‌యంలో అస్స‌లు సిగ్గుప‌డ‌నంటూ కామెంట్

Authored By Sam C | The Telugu News | Updated on : 19 February 2022, 1:00 pm

Anasuya : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు అన‌సూయ‌. ఈ ముద్దుగుమ్మ యాంక‌ర్‌గానే కాకుండా న‌టిగాను స‌త్తా చాటుతుంది. 1985 మే 15న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది అన‌సూయ‌. ప్రస్తుతం ‘జబర్దస్త్’​ కామెడీ షోతో పాటు అనేక బుల్లితెర కార్యక్రమాలకు అనసూయ యాంకర్ గా పనిచేస్తోంది. అలానే టీవీ కార్య‌క్ర‌మాలు సినిమాలు కూడా చేస్తూ స‌త్తా చాటుతుంది. ఈ ముద్దుగుమ్మ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల‌లో నిలుస్తూ హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. తాజాగా అన‌సూయ త‌న ఏజ్ విష‌యంలో సెన్సేష‌న‌ల్‌గా మారింది.

అన‌సూయ‌పై సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ స‌హ‌జం. తనపై ఎంతగా ట్రోల్స్ జరిగినా.. అనసూయ మాత్రం అంతే ఘాటుగా బదులిస్తూ ఉంటుంది. ఈ సారి ఓ వెబ్ సైట్ లో అనసూయ వయసుని 40 ఏళ్ళు అంటూ తప్పుగా ప్రచారం చేశారు. దీనికి అనసూయ ట్విట్టర్ లో సమాధానం ఇచ్చింది. నా వయసు 40 కాదు.. 36. వయసు ఎవరికైనా పెరుగుతూనే ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ నాకు తెలుసు. కానీ వయసుకి తగ్గట్లుగా నేను అందంగా కనిపిస్తానని ప్రామిస్ చేస్తున్నా. కానీ జర్నలిస్ట్ లు ఇలా తప్పుడు ప్రచారం మాత్రం చేయొద్దు అంటూ చురకలంటించింది. అన‌సూయ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.

anasuya fire on journalist

anasuya fire on journalist

Anasuya : అన‌సూయ‌కి కోపం వ‌చ్చిందిగా…

పుష్ప 2లో ఆమె దాక్షాయణిగా అల్లు అర్జున్ పై ఎలా పగ తీర్చుకుంటుంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అలానే రంగ‌మార్తాండ అనే సినిమాలో కూడా న‌టిస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మారాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ.

Advertisement

Sam C

No bio available for this author.

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి