Anasuya : పిల్ల‌ల త‌ల్లివి పొట్టి బ‌ట్ట‌లు అవ‌స‌ర‌మా అన్న నెటిజ‌న్.. నీ పని చూసుకో అంటూ అన‌సూయ ఫైర్

Authored By Sam C | The Telugu News | Published on: April 4, 2022, 7:00 pm

Anasuya: అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బుల్లితెర యాంక‌ర్‌గా,న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముందు న్యూస్ రీడ‌ర్‌గా అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న అన‌సూయ ఆ త‌ర్వాత అడవి శేష్ హీరోగా వచ్చిన ‘క్షణం’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే హిట్‌తో పాటు మంచి నటి అన్న పేరును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర తన కెరీర్‌నే మలుపు తిప్పింది. తాజాగా పుష్పలో కూడా లుక్స్ పరంగా డిఫరెంట్‌గా ట్రై చేసింది అనసూయ . దాక్షాయ‌ణి పాత్ర‌లో అద‌ర‌గొట్టింది.

ద‌ర్జా అనే సినిమాలో కూడా అనసూయ నెగెటివ్ పాత్ర‌లో అద‌ర‌గొట్ట‌నుంది.సినిమాల ఎంపిక విషయంలో అన‌సూయ ఎప్పుడూ తొందరపడదు. కథని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. అయితే గ్లామ‌ర్ విష‌యంలో ఈ అమ్మ‌డికి అడ్డు అదుపు లేదు. త‌న అందాలతో నిత్యం నెటిజ‌న్స్ ని మంత్ర ముగ్ధుల‌ని చేస్తూనే ఉంటుంది. పొట్టి దుస్తుల‌లో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంటుంది. కేక పెట్టించే పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల‌లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తుంటుంది.

anasuya fire on netigen

anasuya fire on netigen

Anasuya : పంచ్ మాములుగా లేదుగా..

రీసెంట్‌గా అన‌సూయ పొట్టి దుస్తులు ధ‌రించ‌గా,ఓ నెటిజ‌న్ ఆమె డ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమెకే ట్యాగ్‌ చేశాడు. `అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు` అంటూ కన్నీరు కారుస్తున్న ఎమోజీని పంచుకున్నాడు సదరు నెటిజన్. దీనిపై అనసూయ స్పందించింది. ఘాటుగా కౌంటర్‌ ఇచ్చింది. `దయచేసి మీరు మీ పని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు` అంటూ మైండ్‌ బ్లోయింగ్‌ రిప్లై ఇచ్చింది. ఈ దెబ్బకి ఆ నెటిజ‌న్ మ‌రో మాట మాట్లాడ‌లేదు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp