Anasuya : అన‌సూయ అందానికి చిత్తైపోతున్న ఫ్యాన్స్.. ఇలా అయితే ఎలా అమ్మ‌డు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : అన‌సూయ అందానికి చిత్తైపోతున్న ఫ్యాన్స్.. ఇలా అయితే ఎలా అమ్మ‌డు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :13 June 2022,1:30 pm

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేస్తుంది. క్యూట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లని మెస్మరైజ్‌ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు మండే బ్లూస్ అంటూ కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఇందులో క్యూట్ లుక్స్‌లో క‌నిపించింది. అన‌సూయ‌ని ఇలా చూసి చిత్తైపోతున్నారు. అమ్మ‌డి పిక్స్ వైర‌ల్‌గా మారాయి. అనసూయ అంటే ఆమె యాంకరింగ్‌ మాత్రమే గుర్తుకొస్తుంది. మరోవైపు రంగస్థలం తర్వాత ఆమె నటిగానూ పాపులారిటీని సొంతం చేసుకుంది. కీలక పాత్రలకు అనసూయ కేరాఫ్‌గా నిలుస్తుంది.

బలమైన పాత్రలతోనే ఆకట్టుకుంటున్న ఈ భామ హీరోయిన్‌గా సినిమా చేసిందనే విషయం ఇటీవ‌ల‌ బయటకొచ్చింది. నందుతో క‌లిసి ఓ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింద‌ట అన‌సూయ‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల చెప్పుకొచ్చాడు నందు. ప్రస్తుతం అనసూయ `జబర్దస్త్` యాంకర్‌గా రాణిస్తుంది. ప్రారంభం నుంచి ఆమె ఈ షోని తనదైన గ్లామర్‌ తో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రతి వారం ఈ షో కోసం అందంగా ముస్తాబై అందాల విందుని వడ్డిస్తుంది. ఇటీవల మరికొన్ని షోస్‌ పెంచింది అనసూయ. `సూపర్‌సింగర్‌ జూనియర్స్` కి యాంకర్‌గా చేస్తుంది. సుడిగాలిసుధీర్‌తో కలిసి హంగామా చేస్తుంది. మరోవైపు నటిగా వెండితెరపై క్షణం తీరిక లేకుండా ఉంది. ప్రస్తుతం ఆమె `దర్జా`, `పుష్ప 2`, `సింబా`, `వాండెట్‌ పండ్‌ గాడ్‌` చిత్రంలో నటిస్తుంది.

anasuya glamorous looks are stunning

anasuya glamorous looks are stunning

Anasuya : అన‌సూయ అద‌ర‌హో..

తమిళంలో నూ ఓ సినిమా చేస్తుంది అనసూయ. అనసూయ ఇటీవ‌ల త‌న భర్త భరద్వాత్‌తో కలిసి ఓ అద్భుత ప్రపంచంలో విహరించింది. అందమైన ప్రకృతి ఒడిలో భర్తతో చేయి పట్టుకొని సముద్ర తీరంలో నీటి అలల మధ్య అడుగులో అడుగులు వేస్తూ వారి దాంపత్య జీవితంలోని మధుర క్షణాల్ని సోషల్ మీడియా షేర్ చేసుకుంది . ప్రొఫెషనల్‌ లైఫ్ లో బిజీగా ఉన్నప్పటికి పర్సనల్‌ లైఫ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అనసూయ..తన నచ్చిన వాడితో కలిసి బీచ్‌లో ఎంజాయ్‌ చేసింది. ప్రేమ ఎంత మధురమైనదో..ఆ అనుబంధం పెళ్లి తర్వాత ఎంత బల పడుతుందో అనసూయ తన భర్త సుశాంక్‌ భరద్వాజ్ తో కలిసిన ఫోటోలు ,వీడియో లను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది