Home » Entertainment » Anasuya Glamorous Pics Viral
Entertainment

Anasuya : చిల‌క‌ప‌చ్చ చీరలో కుర్రాళ్ల హృద‌యాలు కొల్ల‌గొడుతున్న అన‌సూయ‌

Authored By
Sam C
The Telugu News | Updated on: August 16, 2022 4:01 pm
Advertisement

Anasuya : అందంతో పాటు ఎదుటి వారిని ఆక‌ర్షించే త‌త్వం ఉన్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. ఈ అమ్మ‌డు ఏం చేసిన అది సెన్సేష‌న్ అవుతుంది. జబర్థస్త్ కామెడీ షో అంత పాపులర్ అవ్వడంలో అనసూయ పాత్ర ఖచ్చితంగా ఉంది. దాదాపు 9 ఏళ్ళు జబర్థస్త్ కు యాంకర్ గా.. సక్సెస్ ఫుల్ జర్నీ చేసిన అనసూయ.. రీసెంట్ గా యాంకర్ చైర్ నుంచి తప్పుకున్నారు. అయితే ఆమె ఎందుకు జబర్థస్త్ వదిలేశారు అన్న విషయంలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిపై ఎప్పుడూ స్పందించలేదు అనసూయ. ఇక రీసెంట్ గా ఈ విషయంపై స్పందిస్తూ హాట్ టాపిక్‌గా నిలిచింది.

Advertisement

Anasuya : అందం అంటే అన‌సూయ‌దే..!

తన అందంతో తరచూ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టే నటి అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. పుష్ప 2 లో అనసూయ పాత్ర షాకింగ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మ‌రోవైపు అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో ప‌లు సినిమాలు కూడా సెట్స్ పై ఉన్నాయి.

anasuya glamorous pics viral

Advertisement

ఒకవైపు టీవీ షోస్‌తో బిజీగా ఉన్న అన‌సూయ మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూనే ఉంది. తాజాగా చిల‌క‌ప‌చ్చ శారీలో తెగ సంద‌డి చేస్తూ హోయ‌లు పోయింది. అన‌సూయ‌ని ఇలా చూసి కుర్ర‌కారు మ‌త్తెక్కిపోతున్నారు. అంతేకాదు ఈ బ్యూటీ క్యూటీ లుక్స్‌కి తెగ ఫిదా అవుతున్నారు. ప్ర‌స్తుతం అన‌సూయ స్ట‌న్నింగ్ లుక్స్ నెట్టింట తెగ సంద‌డి చేస్తున్నాయి. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. పుష్పలో కూడా మెప్పించింది. అలానే బుల్లితెర‌పై అనేక వెరైటీ షోస్ చేసి మెప్పించింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి