Anasuya : బిగ్ న్యూస్‌… శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం రాబోతున్న జబర్దస్త్‌ అనసూయ

 Authored By prabhas | The Telugu News | Updated on :20 January 2023,11:40 am

Anasuya : ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి రేటింగ్‌ వారం వారం దారుణంగా పడిపోతుంది. అయినా కూడా మల్లెమాల వారు ఆ కార్యక్రమాన్ని నెట్టుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వెళ్లి పోయిన వారిని వెనక్కు తీసుకు వస్తే బాగుంటుందని అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు, కానీ మల్లెమాల వారు ఎప్పుడు కూడా వెళ్లి పోయిన వారిని తిరిగి తీసుకు వచ్చే ప్రయత్నం చేయలేదు. వస్తామని అడిగినా కూడా వారిని వద్దని చెప్తారు. కనుక వెళ్లి పోయిన ఏ ఒక్క కమెడియన్ కానీ, యాంకర్ కానీ, జడ్జి కానీ తిరిగి వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది.

ఈ సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా అనసూయ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ కొత్త ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ కార్యక్రమానికి సుదీర్ఘ కాలం పాటు యాంకర్ గా వ్యవహరించిన అనసూయ ఆ మధ్య సినిమాలతో తాను బిజీగా ఉన్నాను అంటూ చెప్పి జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. మల్లెమాల వారు ఆమెను ఆపేందుకు చాలా ప్రయత్నించినా కూడా ఆమె మాత్రం నో చెప్పేసి వెళ్లి పోయింది. స్టార్ మా లో కొన్ని రోజులు కనిపించిన అనసూయ ఈ మధ్య కాలంలో ఏ ఒక్క బుల్లి తెరపై కూడా కనిపించడం లేదు.

Anasuya going to host etv sridevi drama company very soon

Anasuya going to host etv sridevi drama company very soon

దాంతో ఆమెను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మల్లెమాల వారు ఒక మెట్టు వెనక్కు తగ్గి అతి త్వరలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క యాంకర్ గా అనసూయని తీసుకొస్తారని తెలుస్తోంది. సుడిగాలి సుదీర్ ఉన్న సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీకి మంచి రేటింగ్ వచ్చేది. ఆయన పోయిన తర్వాత రష్మి గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఆమె యాంకరింగ్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కించుకోలేక పోతుంది. అందుకే అనసూయను రంగంలోకి దించితే బాగుంటుంది అని అంతా భావిస్తున్నారు. మరో వైపు జబర్దస్త్ కార్యక్రమానికి రష్మి గౌతమ్‌ యాంకర్ గా కంటిన్యూ అవ్వబోతుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి