Anasuya : అవసరానికి వాడుకుంటారు.. అనసూయ సంచలన కామెంట్స్ వైరల్
Anasuya : బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా అనసూయ చేసే రచ్చ ఓ లెవెల్‌లో ఉంటుంది. బుల్లితెరపై యాంకర్‌గా వేసే చిందులు, వెండితెరపై ఐటెం సాంగ్‌లో అనసూయ చేసే స్టెప్పులు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే అనసూయ ఊరికే ఐటం సాంగ్స్‌లొ నర్తించదు. తనకు నచ్చితేనే స్పెషల్ సాంగ్స్‌కు ఓకే చెబుతుంటుంది. రెమ్యూనరేషన్ ఎంత ఇస్తామన్నా సరే అనసూయ అలాంటి వాటికి ఒప్పుకోదు.
హీరో, ప్రొడక్షన్ హౌస్ ఇలా అన్నింటిని బేరీజు వేసుకుని అనసూయ ఓకే చెబుతుంది. అలా సాయి ధరమ్ తేజ్ విన్నర్ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. తన పేరు మీదే రాసిన పాట కావడంతో అనసూయ ఓకే చెప్పినట్టుంది. అయితే మళ్లీ ఇన్ని రోజుల తరువాత అనసూయ మరో ఐటెం సాంగ్‌ను చేసేందుకు రెడీ అయింది. కార్తికేయ హీరోగా వస్తోన్న చావు కబురు చల్లగా అనే సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తోంది.

Anasuya In Chavu kaburu challaga Item SongAnasuya In Chavu kaburu challaga Item Song
Anasuya : అవసరానికి వాడుకుంటారు..
గత కొన్ని రోజులుగా వాటిపై అనేక రూమర్లు వచ్చాయి. ఈ ఐటం సాంగ్ కోసం అనసూయ 20 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటోందనే టాక్ కూడా వచ్చింది. అయితే తాజాగా ఈ ఐటం సాంగ్ గురించి అప్డేట్ ఇచ్చిన అనసూయ ఆ పాటలోని లిరిక్స్‌ను షేర్ చేసినట్టుంది. అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు.. అవసరం తీరాక ఆడుకుంటారు అంటూ అదిరిపోయే స్టిల్స్‌ను షేర్ చేసింది.