Anasuya : పొరబాటు చేసిన మల్లెమాల టీం.. అలా దొరికేసిన అనసూయ

 Authored By prabhas | The Telugu News | Updated on :18 March 2022,3:30 pm

Anasuya : జబర్దస్త్ షోను ఆర్గనైజ్ చేసేది మల్లెమాల అండ్ టీం అన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ ఈ రేంజ్‌లో సక్సెస్ అవ్వడానికి మల్లెమాల కృషి ఎంతో ఉంది. అయితే ప్రతీసారి మల్లెమాల మీద నెగెటివ్ ట్రోలింగ్ ఎక్కువగా వస్తుంటుంది. జబర్దస్త్ షోలో ఒక్కోసారి స్కిట్లు పరిమితులు దాటుతుంటాయి. దీంతో జనాలు మల్లెమాలను ఏసుకుంటూ ఉంటారు. జబర్దస్త్ షోను బాగానే ఎడిట్ చేసి పెడుతుంటారు. ఇక ప్రోమోల ఎడిటింగ్ తీరు కూడా బాగానే ఉంటుంది.

ఒక్కో సారి ఆ ప్రోమోలో ఉండే విషయాలు, ఎపిసోడ్ స్కిట్లో ఉండవు. అయితే తాజాగా అనసూయ ఓ తప్పు చేసి దొరికేసింది. అనసూయ చెప్పిన ఇంట్రోకి, వచ్చిన స్కిట్లకు సంబంధం లేకుండా పోయింది. ఈ విషయాన్ని ఎడిటింగ్ టీం సరిగ్గా చూసుకోలేదనుకుంటా. హైపర్ ఆది టీం చేయబోతోన్న స్కిట్ గురించి అనసూయ ఇంట్రో ఇచ్చింది. ఆ ఇంట్రోలో అనసూయ భాష సినిమా గురించి చెప్పింది. కానీ ఆది చేసిన స్కిట్ మాత్రం ఇంద్ర సినిమాకు స్పూఫ్.

Anasuya Intro For Hyper Aadi Skit

Anasuya Intro For Hyper Aadi Skit

Anasuya : అనసూయ ఇంట్రోపై చర్చ..

ఈ తప్పు ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో తెలియదు గానీ అందరూ దీని మీదే ఫోకస్ పెట్టేశారు. యూట్యూబ్ కామెంట్లలో దీన్ని పసిగట్టేశారు. భాష సినిమా స్ఫూప్ అన్నారు.. ఇంద్ర సినిమా చేశారేంటి? భాష సినిమాలోకి ఇంద్ర వచ్చిందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి అనసూయ ఇలా దొరికేసింది. అయితే ఇది ఎవరు పొరపాటు అంటే మాత్రం కచ్చితంగా డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్‌దే అయి ఉంటుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి