Anasuya : చీర కట్టు అందాలతో పిచ్చెక్కిస్తున్న యాంకర్ అనసూయ..!
Anasuya : యాంకర్ అనసూయ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఎవరైనా ఉంటారా..? అస్సలు ఉండరంటే అందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. జబర్ ధస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై వచ్చి… అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఇటు యాంకర్ గానే కాకుండా వెండి తెరపై తన నటనతో సత్తా చాటుతోంది. తెలుగు స్టార్ హీరోయిన్లకే లేనంత అందం ఈమె సొంతమని చెప్పాలి. ఇద్దరు పిల్లల తల్లి అయినా.. వయసులో ఉన్న అమ్మాయిలకు తాను ఏమాత్రం కాదంటూ గ్లామర్ ఫోటో షూట్ చేయిస్తూ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తూనే ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా పింక్ కలర్ శారీలో దర్శనమిచ్చిన అనసూయ కుర్రకారు హృదయాలను మరోసారి దోచేసింది.
వెస్ట్రన్ అయినా సాంప్రదాయమైన వస్త్రంలో నైనా అనసూయ ఒదిగి పోయే విధానం పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఈ అమ్మడు ఏ గెటప్ లోనైనా భలే సెట్ అవుతుంది. తాజాగా పసుపు పచ్చని బ్లౌజ్.. దానిపై గులాబీ రంగు చీరతో రెడీ అయిన అనసూయ.. తన అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తూ ఉంటే మతిపోయేలా ఉంది. అయితే అనసూయను ఎంతమంది అయితే పొగుడుతూ ఉంటారో అంతే మంది ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఇద్దరు పిల్లల తల్లిలా ప్రవర్తించవమ్మా అంటూ ఆమెకి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే ఈ నెగెటివ్ కామెంట్లపై ఆమె కూడా అదే స్థాయిలో ఫైర్ అవుతూ రిప్లేలు ఇస్తూ ఉంటారు.

anasuya latest photos going in viral
Anasuya : పింక్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తోంది..:
పోయినేడాది రంగస్థలం సినిమాలో రంగమత్తగా అలరించిన అనసూయ.. తాజాగా అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో తనలోని మరో కొత్త కోణాన్ని చూపించింది. అయితే ఈ సినిమాలో అనసూయ పాత్రను కొద్దిగానే చూపించారని ఆమె అభిమానులు హార్ట్ అయ్యారు. దీనిపై స్పందించిన సుకుమార్ పుష్ప రెండో భాగంలో అనసూయ పాత్ర మరింత పెద్దగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక రెండో భాగంలో అమ్మడు విలన్ పాత్రలో ఏ విధంగా రెచ్చిపోతుందో వేచి చూడాలి.