Anasuya : ఎప్పుడూ ఇలానే ఉండొచ్చు కదా?.. అనసూయపై నెటిజన్ల కామెంట్లు
Anasuya : అనసూయ డ్రెస్సింగ్ ఎప్పుడూ టాపిక్‌గానే మారుతుంటుంది. పొట్టి డ్రెస్సులు వేసుకున్నా, చీర కట్టుకున్నా కూడా అది ఓ సెన్సేషన్ అవుతుంది. చీరకట్టులో అనసూయ తన అందాలను, నాభిని ప్రదర్శిస్తే జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. గతంలో ఓ సారి లైవ్‌లో అనసూయ తన నడుము అందాలను ఖుషీ సినిమా టైపులో ప్రదర్శించింది.
దీంతో జనాలు అంతా ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అయితే అనసూయ చీరకట్టుకు మాత్రం ఫుల్ క్రేజ్ ఉంటుంది. అనసూయ చీర అందాలకు అభిమానులు కూడా ఉన్నారు. తాజాగా అనసూయ ఓ పండుగ ఈవెంట్‌లో కనిపించింది. శ్రీరామనవమి సందర్భంగా ఈటీవీ ఓ ఈవెంట్ చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

Anasuya Look In Sitaramula Kalyanam Chutamu Rarandi
Anasuya : చీరకట్టులో అనసూయ సందడి..
ఇందులో అనసూయ హోస్టింగ్ చేస్తోంది. అయితే అనసూయ ఎంతో సంప్రదాయ బద్దంగా కనిపించింది. అనసూయను అలా చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఇలానే ఎప్పుడూ చక్కగా కనిపించొచ్చు కదా? ఇలానే చీరకట్టుకుని మిగతా షోల్లోనూ హోస్ట్ చేయొచ్చు కదా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ సీతారాముల కళ్యాణం చూతమురారండి షో మాత్రం బాగానే హిట్టయ్యేలా కనిపిస్తోంది.
