Anasuya : లెహంగా ఓణీలో క్యూట్ లుక్‌లో మెరిసిన అనసూయ.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్
Anasuya : బుల్లితెర బ్యూటీ, వెండితెర నటీమణిగా తన అందచందాలతో పాటు క్యూట్‌నెస్‌తో అదరగొడుతున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. రంగస్థలం చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ పుష్ప మూవీ తర్వాత తగ్గేదే లే అంటోంది. వరుస సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతూ ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పుష్ప, ఖిలాడి వంటి సినిమాల్లో నటించిన ఈ భామకు తాజాగా ఓ అదిరిపోయే పాత్ర వచ్చిందని అంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అనసూయకు ఓ ఖతర్నాక్ రోల్‌లో నటించే అవకాశం వచ్చిందట. అంతేకాదు అనసూయను ఓ సీన్‌లో చిరంజీవి బెదిరిస్తారట.దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తెగ వార్తలు హల్ చల్ చేశాయి.
అనసూయ విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారుతుంది. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. అలాగే మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ ఓ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ లోనూ నటించింది అనసూయ అందానికి ఆడియెన్స్ ఎంతలా అట్రాక్ట్ అవుతారో తెలియందీ కాదు. అప్పట్లో ఆమె పేరుపైనే ఓ సాంగ్ కంపోజ్ చేశారు. ‘సూయా..సూయా.. అనసూయా.. అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా’ అంటూ వచ్చిన స్పెషల్ సాంగ్ సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ మూవీకి అట్రాక్షన్ గా నిలిచింది.

anasuya looks like stunning
Anasuya : ఏమందం ఇది..
ఇక సోషల్ మీడియాలో ఈ సుందరి అల్లరి అంతా ఇంతా కాదు. ఒకవైపు ట్రోలర్స్ చేతికి చిక్కెలా ప్రవర్తించడమే కాకుండా.. తన గ్లామర్ తో నెటిజన్లనూ కూడా కట్టిపడేస్తోంది.తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలకు ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు.ఇందులో అందాల ముద్దుగుమ్మ పింక్ దుప్పట్ట, లెహంగాలో, మ్యాచింగ్ బ్లౌజ్ లో అనసూయ పదహారేళ్ల అమ్మాయిలా కనిపిస్తోంది. ఆకట్టుకునే ఫొజులతో కూడిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ‘నేను పువ్వులా పెళుసుగా లేను.. నేను బాంబులాగా ఉన్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలలో అనసూయ స్టన్నింగ్ పిక్స్ చూసి థ్రిల్ అవుతున్నారు.