Anasuya : పిల్ల‌ల‌తో ఫ‌న్ టైం.. కేక పెట్టించే లుక్స్‌లో మ‌త్తెక్కిస్తున్న‌ అన‌సూయ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : పిల్ల‌ల‌తో ఫ‌న్ టైం.. కేక పెట్టించే లుక్స్‌లో మ‌త్తెక్కిస్తున్న‌ అన‌సూయ‌

 Authored By sandeep | The Telugu News | Updated on :17 August 2022,5:40 pm

Anasuya: సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్‌డేట్స్ ఇచ్చే యాంకర్ అనసూయ.. క్షణం తీరిక లేని లైఫ్ లోను కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. తరచుగా వెకేషన్స్ కి వెళతారు. భర్త, పిల్లలతో రెస్టారెంట్స్ లో ఇష్టమైన ఆహారం తినడం ఆమెకు నచ్చిన వ్యాపకాల్లో ఒకటి. స్టార్ యాంకర్ అయినప్పటికీ కుటుంబాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు. తాజాగా అన‌సూయ త‌న పిల్ల‌ల‌తో స‌ర‌దా స‌మ‌యం గ‌డుపుతుంది. రెస్టారెండ్ లో ఫుడ్‌ని ఆస్వాదిస్తూ చిల్ అవుతున్న స‌మ‌యంలో అన‌సూయ క్యూట్ క్యూట్‌గా ఫోటోల‌కు ఫోజులిచ్చింది. అవి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Anasuya : అదిరే అందాల‌తో కవ్విస్తున్న అను..

నటిగా కూడా బిజీగా ఉన్న అనసూయ తక్కువ రెమ్యూనరేషన్ తో జబర్దస్త్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఆమె ఈ షో వీడడం వెనుక అసలు కారణం ఇదే అని వినికిడి. అనసూయ వెండితెర కెరీర్ జోరుగా ఉంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన దర్జా మూవీ ఇటీవల విడుదలైంది. అయితే ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా అనసూయ సినిమాలు, సిరీస్లతో బిజీ లైఫ్ అనుభవిస్తున్నారు.అలాగే వాంటెడ్ పండు గాడ్ మూవీలో ఆమె కీలక రోల్ చేయగా విడుదలకు సిద్ధంగా ఉంది.

anasuya mesmarizing looks viral

anasuya mesmarizing looks viral

ఇక అనసూయ ఖాతాలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో పుష్ప 2 ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అనసూయ నెగిటివ్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో ఆమెది దేవదాసి రోల్ అని సమాచారం. రంగమార్తాండలో ఆమె పాత్ర కొంచెం బోల్డ్ గా ఉండే ఆస్కారం కలదు. ఇక క్రిష్ ద‌ర్వ‌క‌త్వంలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అలానే ప‌లు టీవీ షోల‌లో కూడా అన‌సూయ సంద‌డి చేస్తుంది. చూస్తుంటే రానున్న రోజుల‌లో అన‌సూయ సంద‌డి మాములుగా ఉండదు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది