Anasuya : ఆయనతో ప్రతీరోజూ ప్రేమలో పడతాను.. మనసులోని మాట చెప్పిన అనసూయ
Anasuya : బుల్లితెరపై అనసూయ అందాలు ఎలా హాట్ టాపిక్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా కూడా అనసూయ మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. పొట్టి బట్టలు ధరించినా, సంప్రదాయ దుస్తుల్లో మెరిసినా కూడా అనసూయ అందాలకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక బుల్లితెరపై అనసూయ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. వెండితెరపైనా అనసూయ ఇప్పుడు దుమ్ములేపుతోంది.అనసూయ లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే.
ఎన్నో షోల్లో తన ప్రేమ కథ గురించి చెప్పింది. ఎన్‌సీసీ క్యాంపులో ప్రేమ మొదలైందని, ఇంట్లో వాళ్లకు తెలియకుండా బాగానే మ్యానేజ్ చేసిందట. అమ్మకి మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉండేదట. నాన్నకి మాత్రం తెలియకుండా వ్యవహారం నడిచిందట. ఈ ప్రేమ పెళ్ళికి పెద్దలు అంగీకరించకపోవడంతో బయటకు వచ్చి భరద్వాజ్‌ను అనసూయ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.మళ్లీ కొంత కాలానికి పెద్దలంతా కలిసి తమ పెళ్లి చేశారంటూ అనసూయ చెప్పుకొచ్చింది.

Anasuya On Susank Bharadwaj In Sitaramula Kalyanam Chutamu Rarandi
ఇక భరద్వాజ్ గురించి తాజాగా అనసూయ ఎంతో గొప్పగా చెప్పేసింది. శ్రీరామ నవమి సందర్భంగా ఈటీవీలో ఓ స్పెషల్ ఈవెంట్ రానుంది. శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి అంటూ ఈవెంట్ రాబోతోంది. ఇందులో అనసూయ తన భర్త గురించి ఎంతో గొప్పగా చెప్పింది.మా ఆయనతో రోజూ ప్రేమలో పడతాను.. మా ఆయన అని చెప్పడం కాదు గానీ.. ఆయనలాంటి భర్త ఈ ప్రపంచానికి అవసరం.. అంటూ అనసూయ ఎమోషనల్ అయింది. మొత్తానికి భర్త మీదున్న ప్రేమను అనసూయ ఇలా వ్యక్త పరిచింది.
