Anasuya : జబర్దస్త్ నుండి అనసూయ అవుట్.. ఆమె స్థానంలో రాబోతున్న యాంకర్ ఎవరో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: July 31, 2022, 4:20 pm

Anasuya : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు అన‌సూయ‌. చూడ చ‌క్కని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది దృష్టిని ఆక‌ర్షించింది. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపుల‌రిటీ తెచ్చుకున్న అన‌సూయ‌ గత వారం ఎపిసోడ్ తో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. ఈ లెజెండరీ కామెడీ షో ప్రారంభం నుండి యాంకర్ గా ఉన్న అనసూయ అనూహ్యంగా బయటికి వెళ్ళిపోయింది. జులై 28న ప్రసారమైన ఎపిసోడ్ అనసూయకు చివరిది. అనసూయను షో వీడకుండా చేయాలని టీం లీడర్స్, జడ్జెస్ చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారు. జడ్జి ఇంద్రజ మిమ్మల్ని ఈ స్టేజ్ చాలా మిస్ అవుతుందని చెప్పింది.

తాజా సమాచారం ప్రకారం ప్రముఖ యాంకర్ మంజుష ఇప్పుడు అనసూయ స్థానంలో జబర్దస్త్ కి హోస్ట్ గా వ్యవహరించనుందట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఆగస్టు 4 న ఎయిర్ కాబోతున్న ఎపిసోడ్ నుంచి కొత్త యాంకర్ అనసూయ స్థానంలోకి రాబోతోంది. మరోవైపు అనసూయ అభిమానులు మాత్రం ఈ విషయమై చాలా నిరాశ చెందుతున్నారు. ఆగస్టు 4న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో మల్లెమాల వారు తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కి కార్తికేయ 2 మూవీ టీమ్ నిఖిల్, శ్రీనివాసరెడ్డి, దర్శకుడు చందూ మొండేటి వచ్చారు. ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

anasuya place relpalced by manjusha

anasuya place relpalced by manjusha

Anasuya : ఎవ‌రు రాబోతున్నారు…

టీమ్ లీడర్స్, కమెడియన్స్ నవ్వులు పూయించారు. చివర్లో యాంకర్ ని పరిచయం చేశారు. జబర్దస్త్ కొత్త యాంకర్ ని ఏకంగా పల్లకీలో తెచ్చారు. ఆమె ఎవరో తెలుసుకోవాలని టీమ్ లీడర్స్ కూడా పోటీపడ్డారు. నెక్స్ట్ ఎపిసోడ్ పై హైప్ తేవడానికి ఆ యాంకర్ ఎవరో చూపించకుండానే ప్రోమో కట్ చేశారు. సీనియర్ యాంకర్ మంజుషాను తీసుకున్నట్లు కొన్నాళ్లుగా కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది వచ్చే వారం ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు చెప్పలేం. ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా రష్మీ గౌతమ్ కొనసాగుతున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp