Jabardasth Faima : ఏ అవార్డు వద్దు.. ప్రవీణ్ కావాలి.. ప్రేమను బయటపెట్టేసిన జబర్దస్త్ ఫైమా

Authored By aruna | The Telugu News | Published on: July 31, 2022, 3:40 pm

Jabardasth Faima : పటాస్ షో నుంచి ప్రవీణ్ ఫైమాల లవ్ స్టోరీ నడుస్తోంది. పటాస్ షోలో ఈ ఇద్దరూ చేశారు. అక్కడి నుంచి వీరి స్నేహం మొదలైంది. క్రమక్రమంగా అది ప్రేమగా మారిపోయింది. ఇప్పుడు ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. తన ప్రేమ విషయాన్ని ప్రవీణ్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాడు. కానీ ఫైమా మాత్రం ఎప్పుడూ నోరు తెరిచి ప్రవీణ్ అంటే ఇష్టం ఐ లవ్యూ అనే పదాలు మాత్రం చెప్పలేదు. అలా అని ప్రవీణ్ అంటే ఇష్టం లేదని కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఇక తాజాగా క్యాష్ షోలోకి ఈ జోడి ఎంట్రీ ఇచ్చింది. వచ్చే వారం ప్రసారం కాబోతోన్న ఈ ఎపిసోడ్‌లో జబర్దస్త్ జోడిలు వచ్చాయి.

షబీనా కెవ్వు కార్తీక్, పరదేశీ భాను, ప్రవీణ్ ఫైమా, నూకరాజు ఆసియాలను తీసుకొచ్చింది సుమ. ఇందులో ప్రవీణ్ ఫైమా, నూకరాజు ఆసియాలను సుమ పరీక్షించింది. తమ ప్రేమ ఎంత వరకు నిజమైందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా నూకరాజుకు కఠినమైన పరీక్షలు పెట్టింది. చేతి మీద కర్పూరం వెలిగించుకోవడం, మెడలో తాళి కట్టమని తాళి ఇవ్వడం వంటి పరీక్షలు పెట్టేసింది. అయితే ప్రవీణ్, ఫైమాలకు ఇంకో టైపు పరీక్షలు పెట్టింది. సూపర్ సినిమాలో లై డిటెక్టర్ పెట్టేసింది. నీకు బెస్ట్ కమెడియన్ అవార్డు కావాలా? ప్రవీణ్ కావాలా? అని ఫైమాను సుమ అడిగింది. నాకు అవార్డు వద్దు ప్రవీణ్ కావాలి అని ఫైమా అంటుంది.

Jabardasth Faima About Her Love on Praveen In Suma Cash Show

Jabardasth Faima About Her Love on Praveen In Suma Cash Show

తప్పు అన్నట్టుగా ఆ మిషన్ మొత్తుకుంటుంది. మళ్లీ ప్రవీణ్ కావాలని అంటుంది. మళ్లీ కూడా మిషన్ అరుస్తుంటుంది. అలా మిషన్ ఎన్ని సార్లు అరిచినా కూడా ఫైమా మాత్రం వెనక్కి తగ్గదు. నువ్ ఎన్ని సార్లు అరిచినా కూడా నాకు ప్రవీణ్ కావాలని చెబుతాను అంటుంది ఫైమా. అలా ప్రవీణ్ మీదున్న ప్రేమను ఫైమా బయటపెట్టేసింది. సుమ మాత్రం ఇలా రియల్ కపుల్స్‌ను తీసుకొచ్చి వారి ప్రేమను అందరి ముందు బయటపెట్టేస్తోంది. తద్వారా తన షోకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్‌ను బాగానే పెంచేసుకుంటోంది. ఇక ఇప్పుడు మాత్రం ఈ క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp