Anasuya : జబర్దస్త్‌లో అనసూయకు ఇచ్చింది ఎంత .. కామెడీ స్టార్ లో ఇప్పుడు ఇస్తున్నది ఎంత? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : జబర్దస్త్‌లో అనసూయకు ఇచ్చింది ఎంత .. కామెడీ స్టార్ లో ఇప్పుడు ఇస్తున్నది ఎంత?

Anasuya : గత నాలుగైదు వారాలుగా జబర్దస్త్ నుండి అనసూయ వెళ్ళిపోతుంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి ఆమె జబర్దస్త్ స్టార్ మా లో జాయిన్ అయ్యిందని ప్రచారం జరిగింది. అంతా అన్నట్లుగానే స్టార్ మా లో ఆమె ప్రత్యక్షం అవడంతో నిజంగానే జబర్దస్త్ మానేస్తుంది అంతా భావించారు, కానీ జబర్దస్త్ అభిమానులు మాత్రం స్టార్ మా లో ఆమె చేస్తూనే కచ్చితంగా జబర్దస్త్ లో కూడా కనిపించబోతుంది అంటూ నమ్మకం వ్యక్తం చేశారు. కానీ తాజాగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 August 2022,11:30 am

Anasuya : గత నాలుగైదు వారాలుగా జబర్దస్త్ నుండి అనసూయ వెళ్ళిపోతుంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి ఆమె జబర్దస్త్ స్టార్ మా లో జాయిన్ అయ్యిందని ప్రచారం జరిగింది. అంతా అన్నట్లుగానే స్టార్ మా లో ఆమె ప్రత్యక్షం అవడంతో నిజంగానే జబర్దస్త్ మానేస్తుంది అంతా భావించారు, కానీ జబర్దస్త్ అభిమానులు మాత్రం స్టార్ మా లో ఆమె చేస్తూనే కచ్చితంగా జబర్దస్త్ లో కూడా కనిపించబోతుంది అంటూ నమ్మకం వ్యక్తం చేశారు. కానీ తాజాగా ఆమె జబర్దస్త్ ను వదిలేసినట్లు అధికారికంగా ప్రకటించింది. వచ్చేవారం జబర్దస్త్ కొత్త యాంకర్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ సమయంలో అనసూయ జబర్దస్త్ లో మానేయడానికి గల కారణం ఏంటి అనేది ఆసక్తికరంగా చర్చజరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ తక్కువ పారితోషికం ఇస్తున్న కారణంగానే వీడింది అంటూ ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ కోసం ఒక్క రోజు పని చేస్తే అనసూయకు మూడు లక్షల వరకు పారితోషికం వచ్చేదట. కానీ ఇప్పుడు స్టార్ మా లో ఆమె చేసినందుకుగాను రూ. 5 లక్షల వరకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా డేట్ల విషయంలో అనసూయకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లుగా కూడా స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆమెకు ఇష్టమైన సమయంలో వచ్చే అవకాశాన్ని ఆశిస్తూ నిర్వాహకులు ఇచ్చారట.

Anasuya Remuneration in Jabardasth and Comedy Stars

Anasuya Remuneration in Jabardasth and Comedy Stars

అందుకే అనసూయ ఆలోచించకుండా ఆ కార్యక్రమంలో కనిపించేందుకు ఒకే చెప్పినట్లుగా తెలుస్తోంది. పారితోషికం భారీగా పెరగడంతో పాటు సమయం తక్కువ అడగడం వల్ల కూడా అనసూయ జబర్దస్త్ ను వీడినట్లు గా సమాచారం అందుతోంది. మొత్తానికి జబర్దస్త్ నుండి కేవలం డబ్బు కోసమే అనసూయ మారింది అంటూ జబర్దస్త్ అభిమానులు బలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది అనసూయ మరోసారి క్లారిటీ వస్తుందేమో చూడాలి. గతంలోనే తాను సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాను కాబట్టి జబర్దస్త్ ని వీడుతున్నట్లుగా ప్రకటించింది. ఆ విషయం నిజం కాదని కొందరు అంటున్నారు, మరి అనసూయ ఏమంటుందో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది