Anasuya : అనసూయ ఆసక్తికర పోస్ట్.. అందరిని తెగ ఆలోజింపచేస్తుందిగా..!
Anasuya : అందంతో పాటు చలాకీ మాటలతో కుర్రకారు మనసులు దోచుకుంటున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. తను సాధించిన విజయాలు, పంచిన ప్రేమ, స్వతంత్ర, ఆత్మవిశ్వాసం అనసూయలో ఫుల్ ఎనర్జీని నింపింది. నిజంగా అనసూయలో ఆత్మవిశ్వాసం టన్నులకొద్దీ ఉంది. తన డ్రెస్సింగ్ స్టైల్ పై ఎన్ని విమర్శలు వచ్చినా ఐ డోంట్ కేర్ అంటుందీ జబర్దస్త్ యాంకర్. అనసూయ పొట్టి బట్టలపై ఎప్పుడూ ఏదో ఒక వివాదం చెలరేగుతూ ఉంటుంది. లేటెస్ట్ గా ఓ నెటిజన్ ఇద్దరు పిల్లల తల్లై ఉండి అలాంటి బట్టలు ఎలా వేసుకుంటున్నారంటూ.. ప్రశ్నించాడు. దానికి సమాధానంగా అనసూయ… నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. ఇలా బట్టలపై కామెంట్ చేసి మగజాతి పరువు తీయకు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ విసిరింది.
హాట్ నెస్ కోరుకునే టెలివిజన్ ఆడియన్స్ కి అనసూయ అదృష్టంలా దొరికింది. జబర్దస్త్ లో నాన్ స్టాప్ కామెడీ ఒకెత్తయితే.. అనసూయ అందాలు మరొక ఎత్తు. కేవలం అనసూయ కోసమే జబర్దస్త్ చూసే ప్రేక్షకులు చాలా మందే ఉన్నారు. అనసూయ ప్రధాన పాత్రలో దర్జా టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. ఇటీవల దర్జా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జా మూవీలో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది. దర్జా మూవీలో ఆమె లుక్ లేడీ డాన్ ని పోలి ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసింది అనసూయ.

anasuya shares intresting post
Anasuya : అనాలోచితంగా నేను..
అనసూయ చలాకీతనం, మెస్మరైజ్ చేసే అందంతో సినిమా ఆఫర్స్ అందుకుంటోంది. వెండితెరపై ఓ తరహా పాత్రలకు అనసూయ బెస్ట్ ఛాయిస్ అయ్యారు. రంగస్థలం మూవీలో అనసూయ రోల్ ఆమెకు బ్రేక్ ఇవ్వగా వెండితెరపై బిజీ అయ్యారు. నటిగా, యాంకర్ గా ఊపిరి తీసుకోలేనన్ని షెడ్యూల్స్ అనసూయకు ఉన్నాయి. ఎంత తీరిక లేకున్నా తన సోషల్ మీడియా ఫ్యాన్స్ ని మాత్రం అనసూయ మర్చిపోదు. హాట్ ఫోటో షూట్స్ తో వాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా అనసూయ తనకు సంబంధించి ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో అనసూయ తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పకనే చెప్పింది. అనసూయకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
View this post on Instagram