Anasuya : అందరిలానే మా ఆయకు కూడా.. కొందర్ని కలవడం నా భర్తకు ఇష్టం ఉండదు.. అనసూయ..!
ప్రధానాంశాలు:
Anasuya : అందరిలానే మా ఆయకు కూడా.. కొందర్ని కలవడం నా భర్తకు ఇష్టం ఉండదు.. అనసూయ..!
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని గురించి ఓపిగ్గా వివరించింది. చాలామంది తన భర్తను చూసి, “అతనెంతో సహనశీలి, అన్నీ అంగీకరించేవాడు” అనే అభిప్రాయంతో ఉంటారని, కానీ వాస్తవం మాత్రం అది కాదని స్పష్టం చేసింది.“మా మధ్య గొడవలే లేవని ఎవరు అంటారో, వారు అసలు నిజం చెప్పడం లేదు. మా మధ్య కూడా విభేదాలు, గొడవలు జరిగాయి.

Anasuya : అందరిలానే మా ఆయకు కూడా.. కొందర్ని కలవడం నా భర్తకు ఇష్టం ఉండదు.. అనసూయ..!
Anasuya : వ్యక్తిగత జీవితం పై పచ్చి నిజాలు వెల్లడించిన యాంకర్ అనసూయ
నాకు హీరోలతో సినిమాలు చేయడం, పబ్లిక్ ఇంటరాక్షన్స్ ఉండడం మా ఆయనకి నచ్చనప్పటికీ, మనస్సు మార్చుకున్నాడు అని చెప్పింది అనసూయ.అలాగే, తన భర్తపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు గురించి మాట్లాడుతూ..అనసూయ వాళ్ల ఆయన చూడు.. అన్నీ చేయనిస్తాడు. అన్నింటికీ ఒప్పుకుంటాడు అని అందరూ అనుకోవచ్చు. అబ్బాయిలు అయితే వీడు చేతకాని వాడు అని అంటుంటారు.
లక్కీ ఏంటంటే.. మా ఆయనకి తెలుగు రాదు. సోషల్ మీడియాలో ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోరు.
“నన్ను చూసి చాలామంది కామెంట్ చేస్తారు. నాకు అబ్బాయి బ్యాడ్‌గా అనిపిస్తే, నేను కూడా అతనికి అలానే కనిపిస్తా. ఇది నార్మల్ హ్యూమన్ బిహేవియర్. నేను కూడా మా ఆయనతో ఇన్‌సెక్యురీగా ఫీల్ అవుతా. అనసూయకి అసూయ అనేది వాళ్ల ఆయన దగ్గర మాత్రమే ఉంటుంది. ఇంకెక్కడా ఉండదు. నేను మోస్ట్ సెక్యూర్డ్ పర్సన్‌ని. విడాకుల ద్వారా ఆ విలువను తగ్గించుకుంటున్నాం. ఓపిక, సర్దుకుపోవడంతోనే బంధాలు నిలుస్తాయి అని అనసూయ పేర్కొంది.