Anasuya : ముఖమంతా రక్తంతో స్టార్ యాంక‌ర్ అన‌సూయ‌.. అస‌లేం జ‌రిగింది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

 Anasuya : ముఖమంతా రక్తంతో స్టార్ యాంక‌ర్ అన‌సూయ‌.. అస‌లేం జ‌రిగింది?

 Authored By ramu | The Telugu News | Updated on :10 August 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •   Anasuya : ముఖమంతా రక్తంతో స్టార్ యాంక‌ర్ అన‌సూయ‌.. అస‌లేం జ‌రిగింది?

Anasuya : స్టార్ యాంకర్ అనసూయ గాయాలపాలై ర‌క్తమోడుతున్న‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ముఖం రక్తసిక్తంగా మారింది. ఆమెకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో గాయాలతో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. దాంతో కొందరు నెటిజన్స్ ఎవరు కొట్టారని ప్రశ్నిస్తున్నారు.కానీ అవి నిజమైన గాయాలు కాదని ఆమె కామెంట్ ద్వారా తెలుస్తున్న‌ది. అనసూయ న‌టించిన‌ లేటెస్ట్ మూవీ సింబా శుక్ర‌వారం విడుద‌ల‌యింది. జగపతిబాబు, గౌతమి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనసూయ గాయాలతో ఉన్న ఫోటోలు పంచుకుంది. సింబా సెట్స్ లో దిగిన ఫోటోలు అనసూయ తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అనసూయకు ఏం కాలేదు. అది ప్రమోషనల్ స్టంట్ అని తెలిసినా కూడా యాంటీ ఫ్యాన్స్ ఆమెను ఎవరో చితకబాదారని కామెంట్స్ పెడుతున్నారు.మరోవైపు అనసూయ బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. కిరాక్ బాయ్ ఖిలాడీ గర్ల్స్ గేమ్ షోలో శేఖర్ మాస్టర్ తో పాటు జడ్జిగా వ్యవహరిస్తోంది.

Anasuya ముఖమంతా రక్తంతో స్టార్ యాంక‌ర్ అన‌సూయ‌ అస‌లేం జ‌రిగింది

Anasuya : ముఖమంతా రక్తంతో స్టార్ యాంక‌ర్ అన‌సూయ‌.. అస‌లేం జ‌రిగింది?

ఎప్పటిలాగే అనసూయ తన గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది. అనసూయ స్కిన్ షో కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే పలు చిత్రాలలో నటిస్తూ అనసూయ బిజీగా ఉంది. చేతిలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు ఉన్నాయి. పుష్ప 2 ఆమె నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ డిసెంబ‌ర్ 9న విడుద‌ల సిద్ధ‌మైంది. ఈ చిత్రంలో ఆమె దాక్షాయణిగా అలరించనుంది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది