Anchor Anasuya : బుద్ది వచ్చింది.. గుణపాఠం నేర్చుకున్నా: యాంకర్ అనసూయ
Anchor Anasuya యాంకర్ అనసూయకు మా ఎన్నికల్లో దారుణమైన పరాభవం ఎదురైంది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ తరుపున నిలబడ్డ అనసూయకు చుక్కెదురు అయింది. అయితే ఆదివారం జరిగిన ఎన్నికలు, రాత్రి వచ్చిన కథనాల ప్రకారం అనసూయ ఆధిక్యతను కనబర్చింది. భారీ మెజార్టీతో గెలిచిందంటూ అనసూయ మీద వార్తలు వచ్చాయి. అయితే సోమవారం సాయంత్రం ప్రకటించిన అధికారిక ఫలితాల్లో మాత్రం అంతా తారుమారైంది. గెలిసిన 18 మంది ఈసీ మెంబర్ల పేర్లులో అనసూయ పేరు లేనే లేదు.
ఇలాంటి ప్రకటన రావడంతో అనసూయ ఆశ్చర్యపోయింది. ఫలితాలు వచ్చిన వెంటనే ట్విట్టర్‌లో అనసూయ కౌంటర్లు వేసింది. ఓ చిన్న విషయం గుర్తుకు వచ్చింది. మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.. ఏమనుకోకండి.. అద్భుతమైన మెజార్టీ.. భారీ మెజార్టీ అని నిన్న వచ్చింది.. ఈ రోజు ఏమో ఓటమి, లాస్ట్ అని వచ్చింది.
Anchor Anasuya ఓడిపోవడంపై అనసూయ బాగానే హర్ట్
రాత్రికి రాత్రి ఏం జరిగిందబ్బా.. ఉన్న 900వందల ఓట్లు, పోలైన 600వందల చిల్లర ఓట్లను లెక్కించేందుకు రెండు రోజులు ఎందుకు పట్టింది రాత్రికి రాత్రి ఏం జరిగిందబ్బా అని కౌంటర్లు వేసింది.అయితే మా ఎన్నికల్లో జరిగిన అవకతవకలు, ఓడిపోవడంపై అనసూయ బాగానే హర్ట్ అయినట్టు కనిపిస్తోంది.
మా ఎన్నికల్లో జరిగిన రాజకీయాన్ని చూసి జీర్ణించుకోలేకపోయిన అనసూయ ఓ గుణపాఠం నేర్చుకున్నాను అని చెప్పింది. ఇకపై నేను ఎప్పుడూ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వను. రాజకీయాల్లోకి వస్తే మనం నిజాయితీగా ఉండలేం. వాటన్నంటినితో వేగే సమయం నాకు లేదు. దానికి బదులు నా పిల్లలతో ఆడుకుంటే బెటర్.. బుద్దొంచింది.. గుణ పాఠం నేర్చుకున్నాను అని అనసూయ చెప్పుకొచ్చింది.