Anchor Lasya : బెడ్‌పై సెలైన్స్ ఎక్కించుకుంటూ కనిపించిన లాస్య‌.. ఆమె ఆరోగ్యానికి ఏమైంది?

Authored By Sam C | The Telugu News | Published on: September 4, 2022, 12:00 pm

Anchor Lasya : లాస్య‌.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అందాల యాంక‌ర్స్‌లో ఒక‌రు. యాంక‌ర్ ర‌వితో క‌లిసి ఎక్కువ షోస్ చేసి అల‌రించింది లాస్య‌. ఒక‌ప్పుడు బాగానే అద‌ర‌గొట్టిన కూడా పలు వ్యక్తిగత కారణాల వల్ల యాంకరింగ్​కు దూరంగా ఉన్న లాస్య బిగ్​బాస్ హౌజ్​లకో ఎంటరై మళ్లీ గుర్తింపు తెచ్చుకుంది. చురుకైన యాటిట్యూడ్​తో, చలాకీ మాటలతో బుల్లితెరపై ఆద్యంతం ఆకట్టుకుని ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే అనంతరం పలు వ్యక్తిగత కారణాలతో యాంకరింగ్​కు దూరంగా ఉన్న లాస్య బిగ్ ​బాస్ సీజన్ ​4తో బుల్లితెరపై మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ షో ద్వారా అంతగా క్రేజ్ దక్కించుకోలేకపోయింది. అనంతరం ఓ యూట్యూబ్ ఛానెల్​ప్రారంభించి రకరకాల వీడియోలతో అలరిస్తూ వచ్చింది యాంకర్ లాస్య.

Anchor Lasya : ఏమైంది?

బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన త‌ర్వాత లాస్య మ‌ళ్లీ త‌న స్పీడ్ పెంచింది. తన పర్సనల్‌ విషయాలతో పాటు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన వీడియోలను సోష‌ల్ మీడియాలో తరచూ షేర్‌ చేసుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా యాంకర్‌ లాస్య తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త లాస్య మంజునాథ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు.యాంకర్ లాస్య అలా బెడ్డు మీద పడుకుని ఉన్న వీడియోను ఆమె భర్త మంజునాథ్ షేర్ చేస్తూ.. త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్ వేశాడు.

Anchor Lasya health condition news viral

Anchor Lasya health condition news viral

లాస్య భ‌ర్త ఆసుప‌త్రిలో ఉన్న పిక్ షేర్ చేశాడు, కాని ఆయ‌న‌కు ఏమైంద‌నే విష‌యంపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. లాస్య ఆస్పత్రిలో ఎందుకు చేరిందన్న దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. మరోవైపు ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్లు పెడుతున్నారు. కాగా లాస్య కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతోందని, అందుకే ఆస్పత్రిలో చేరినట్లు ప్రచారం సాగుతుంది. కాగా, బిగ్ బాస్ ఇంటి వంటలక్కగా లాస్య మారిపోయింది. వంటలక్కగా అందరికీ వండి పెట్టడం, పప్పు గొడవ ఇలా లాస్యను బాగానే ఫేమస్ అయింది. ఈ షోతోనే లాస్య భర్త మంజునాథ్, పిల్లాడు జున్ను కూడా ఫేమస్ అయ్యాడు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp