Anchor Lasya : ఆ విషయం మాత్రం మాట్లాడకు!.. యాంకర్ ప్రదీప్‌కు లాస్య వార్నింగ్
Anchor Lasya : యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతోన్నాడు. హీరోగా ట్రై చేసినా కూడా అంతగా వర్కవుట్ అవ్వలేదు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అంటూ ప్రదీప్ ప్రేక్షకులను పలకరించాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మళ్లీ ప్రదీప్.. తన యాంకరింగ్‌నే నమ్ముకున్నాడు. సినిమాల జోలికి ఇప్పుడు ప్రదీప్ వెళ్లడం లేదు.
ప్రదీప్ చేతిలో ప్రస్తుతం ఢీ, సూపర్ క్వీన్ షోలున్నాయి. ఇక పండుగలంటూ వచ్చే స్పెషల్ ఈవెంట్లను ప్రదీప్ ఎలా నడిపిస్తాడో అందరికీ తెలిసిందే. అవన్నీ పక్కన పెట్టేస్తే.. ఇప్పుడు ప్రదీప్ సూపర్ క్వీన్ షోతో బాగానే నడిపిస్తున్నాడు. అందులో సీరియల్ నటి మధుమితతో ప్రదీప్ పులిహోర కలిపేస్తున్నాడు. తాజాగా వదిలిన ప్రోమోలో ప్రదీప్ రెచ్చిపోయాడు.

Anchor Lasya Counters To Anchor Pradeep In Super Queen Show
Anchor Lasya : లాస్య వయసుపై ప్రదీప్ కౌంటర్లు..
ఇందులో ప్రదీప్ వంట చేసేందుకు నానా తంటాలు పడ్డాడు. దోశ వేసేందుకు కిందా మీద అయిపోయాడు. అయితే ఈ ప్రోమోలో ప్రదీప్ మాట్లాడుతూ లాస్య వయసు గురించి మాట్లాడాడు. దేని గురించైనా మాట్లాడు కానీ దాని గురించి మాత్రం మాట్లాడకు అని లాస్య అంటే.. ఏంటి గ్లామర్ గురించా? అని ప్రదీప్ మరో సెటైర్ వేస్తాడు. గ్లామర్ గురించి కాదు.. ఏజ్ గురించి అని లాస్య చెప్పుకొస్తుంది. దీంతో అందరూ నవ్వేస్తారు.
